రాష్ట్ర వ్యాప్తంగా హీట్ పుట్టించిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది..ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 82శాతానికి పైగా పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు..క్యూ లైన్‌లో ఉన్న వారందరూ ఓటు హక్కును వినియోగించకుంటే పోలింగ్ శాతం మరింత పెరుగుందని అధికారులు అంచనవేస్తున్నారు.అయితే నిర్ణీత సమయంలోపు లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు..పలు చోట్ల టీఆర్‌ఎస్, విపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి..ఇక పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు అసహనంతో ఉన్నప్పటికి అధికారులు వెంటనే వాటిని బాగు చెశారు..ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటర్లకు మాస్క్ సానిటైజర్‌లను అందిచారు ఎన్నికల అధికారులు..2018లో 86శాతం పోలింగ్ నమోదు కాగా..సగటున దుబ్బాక నియోజకర్గంలో 80 శాతం పోలింగ్ నమోదు అవుంది..కరోనా వైరస్‌ను లెక్క చేయకుండా ఓటర్లు అధిక శాతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు..
ముగిసిన దుబ్బాక ఎన్నికలు..రికార్డ్ స్థాయిలో పోలింగ్!
-