BREAKING : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

-

దుబ్బాక నియోజక వర్గ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్ అయ్యారు. కాసేపటి క్రితమే.. మెదక్‌ పోలీసులు… బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ను అదుపులోకి తీసుకున్నారు. దుబ్బాక నియోజకవర్గానికి వెళ్తోన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును తూప్రాన్ టోల్ గేట్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు మెదక్ పోలీసులు.

అరెస్ట్‌ చేసిన రఘునందన్‌ రావు ను సిద్దిపేట కు తరలించినట్లు సమాచారం అందుతోంది. తన నియోజక వర్గానికి వెళుతుంటే.. అన్యాయంగా పోలీసులు అరెస్ట్‌ చేశారని ఈ సందర్భంగా రఘునందన్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ఉందా అని ప్రశ్నించారు మ్మెల్యే రఘునందన్. తెలంగాణ రాష్ట్రంలో.. జేపీ నడ్డా ర్యాలీకి అస్సలు అనుమతి లేదని… కరోనా రూల్స్‌ బ్రేక్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని… అటు డీసీపీ చందనా దీప్తి హెచ్చరించారు.  ఈ నెల 10 వ తేదీ వరకు కరోనా రూల్స్‌ అమలు లో ఉంటాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version