గుప్పెడంతమనసు 338: వసుధార విషయంలో రిషీకి సప్రైజ్ ఇచ్చిన గౌతమ్ .. అది చూసి ఖంగుతిన్న ఇగోమాష్టర్..

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ క్లాస్ కి వెళ్తాడు. వెనకే..వసూ, పుష్పా వస్తారు. వసు ధ్యాస అంతా..ఆ కీ మీదే ఉంటుంది. వసూ కంగారు చూసిన రిషి.. వసుధార అని పిలిచినా పలకదు. రెండుసార్లు గట్టిగా పిలవడంతో ఉలిక్కిపడిన వసు లేచి నిల్చుంటుంది. ఏం చేస్తున్నావ్ అంటే..వసూ కీ కీ కీ అంటూ నసుగుతుంది. రిషీ పుష్పాని కూడా లేపి..తిడతాడు. వసుధార నీకు క్లాస్ వినడం ఇష్టం లేకపోతే వేరేవాళ్లని డిస్ట్రబ్ చేయొద్దు..నువ్వు క్లాస్ నుంచి బయటకు వెళ్లొచ్చంటాడు. వెంటనే ఎస్ సార్ అనేసి వెళ్లిపోతుంది. షాక్ అయిన రిషి.. ఇదేంటి వెళ్లమనగానే వెళ్తుంది అనుకుంటాడు. వసుధార మాత్రం సార్ కార్ కీ వెతకడానికి ఇదే మంచి సమయం అనుకుని వెళ్లిపోతుంది. రిషీ ఏంటో ఈ వసుధార కి కి కీ అంటుంది అనుకని క్లాస్ స్టాట్ చేస్తాడు.

వసుధార కార్ కీ వెతుకుతుంది. ఏవేవో యసంప్షన్స్ తో పాప తెగ వెతికేస్తుంది. ఇంతలో అక్కడకు వచ్చిన జగతి క్లాస్ వదిలేసి ఇక్కడేం చేస్తున్నావ్ అని అడుగుతుంది. పోయింది వెతుకున్నా అని వసూ అంటుంది. జగతి ఏం పోయింది అంటే.. తర్వాత చెప్తాను అంటుంది వసూ. పోగుట్టుకుంది దొరకడం కష్టం జాగ్రత్త అనేసి వెళ్లిపోతుంది. మొత్తానికి వసూ ఎలాగైతే..కీ కనిపెడుతుంది.

ఇంకోపక్క కాలేజీ కాన్ఫరెన్స్ రూమ్ లో అంతా మీటింగ్ లో ఉంటారు. డీబీఎస్టీ కాలేజీకి ఇంత మంచి పేరు రావడంతో మీ అందరి కృషి ఉందని పొడుగుతాడు ఫణీంద్ర. బంగారానికి మెరుగుపెట్టినట్టు ఈ కాలేజీకి .. మిషన్ ఎడ్యు కేషన్ ప్రాజెక్ట్ మరింత పేరు తీసుకొచ్చిందని చెప్పుకొస్తాడు. ఇలా ఎందుకో..సడన్ గా..ఈ ప్రాజెక్టు గురించి డప్పేసుకుని సీన్ ల్యాగ్ చేస్తారు. అయినా ప్రతిసారి మీటింగ్ కి రిషీ ఉంటాడుగా..తను లేకుండా వీళ్లు వీళ్లు ఈ చర్చలు ఏంటో.

రిషీ- వసుధార

రిషి కార్ కీ దొరకిన తర్వాత కాలేజీ ఆవరణలో మెట్లపై కూర్చుంటుంది వసుధార. పుష్ప వచ్చి..ఎందుకు వసూ క్లాస్ లు మిస్ అవుతున్నావ్ అంటే..నన్ను ఏం అడగొద్దు పుష్పా అంటుంది వసూ. వెళదాం రా అని పుష్ప అన్నప్పటికీ కాసేపు కూర్చుని వస్తానని పంపించేస్తుంది వసుధార. ఇంతలో రిషి రావడం చూసి అటువైపు వెళుతుంది వసుధార. క్లాస్ మిస్ అయ్యావని సారీ చెప్పడానికి వచ్చావా అంటే..సారీ సార్ నేను సారీ చెప్పడానికి రాలేదు అంటుంది వసూ. క్లాస్ లో నువ్వు అలా ఆబ్సెంట్ మైండ్ తో ఉండడం నచ్చలేదంటాడు రిషీ.. వసు మాట్లాడేందుకు ప్రయత్నించినా మాట్లాడనివ్వడు. ఆరోపణ చేసినప్పుడు నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి కదా అంటుంది వసుధార. ఇప్పుడేంటి క్లాస్ నుంచి బయటకు వచ్చావ్, కాలేజీ అయిపోయింది..రెస్టారెంట్ కి వెళ్లాలి కదా లిఫ్ట్ కావాలా నేను లిఫ్ట్ ఇవ్వను అను వెళ్తున్నాను బాయ్ అంటాడు. కార్ కీ వెతుక్కుంటాడు రిషి. ఇంతలో కీ వసుధార కీ ఇస్తుంది. నా కీ నీ దగ్గరకు ఎలా వచ్చింది అంటే..జరిగింది చెప్తుంది వసుధార. మనోడు అంతా విన్నా కార్ కీ కోసం క్లాస్ పోగొట్టుకోవడం నచ్చలేదు..కార్ కీ పోయిందని చెబితే అటెండర్ తో వెతికించేవాడిని అంటాడు. ఆ క్లాస్ మళ్లీ అడిగితే చెప్పరా అనడంతో రిషి కూల్ అయిపోతాడు..

రెస్టారెంట్ లో

కట్ చేస్తే రెస్టారెంట్లో వసుధార టేబుల్ ఎక్కడుందో అడిగి మరీ మన గౌతమ్ కూర్చుంటాడు. గతంలో పాపం..వేరే టేబుల్ లో కుర్చోని..కాఫీల మీద కాఫీలు వేశాడు కదా. గౌతమ్ ఫోనులో మార్నింగ్ తీసుకున్న ఫొటో చూసి… తలెత్తితే బాగుండేది..ఆ కళ్లు గీయడానికి నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను అసలు.. ప్రపంచంలో ఇంతమందిని చూశాను ఈ వసుధారకే ఎందుకు కనెక్టయ్యా.. అంతా దేవుడి లీల అనుకుంటాడు గౌతమ్. ఇంతలో రిషి కూడా రెస్టారెంట్ కి వెళ్లి వసు టేబుల్ దగ్గర కూర్చుంటాడు. సార్ కాఫీ తీసుకురమ్మంటారా అని వసు అడిగితే..ఇక్కడకు ఎందుకొస్తా కాఫీ కోసమే కదా అంటాడు. గౌతమ్- రీషీలు ఒకర్ని ఒకరు చూసుకోరు.

జగతి- మహేంద్ర

జగతి రిషీ చెప్పింది మహేంద్రకు చెప్పినట్లు ఉంది.. నీ పుత్రరత్నం నిన్ను ఇలా కన్ఫ్యూజ్ చేశాడన్నమాట అంటాడు. అవును రిషి క్లియర్ గానే ఉన్నాడు మనమే అర్థం చేసుకోలేకపోయాం అంటుంది జగతి. ఇలా ఇద్దరూ కొడుకు గురించి మాట్లాడుకుంటారు. జగతి మహేంద్రను వసూ రూంకి తీసుకెళ్తుంది. గోలీలు-నెమలి ఈకలు ఉన్న బాటిల్ పై జగతి రాసిన కొటేషన్ చూపిస్తుంది జగతి. వావ్.వండ్రఫుల్ జగతి.. మూడు ముక్కల్లో ఇద్దరి గురించి చెప్పేశావ్ అంటాడు మహేంద్ర. జగతి.. ఇద్దరూ తెలివైన వాళ్లే, స్వతంత్ర భావాలు ఉన్నవాళ్లే..ప్రాబ్లమ్ ఏంటంటే.. ఎవ్వరూ ముందడుగు వేయడం లేదంటుంది. కొడుకు ప్రేమ కథకు నువ్వే వారధిగా మారితే బావుంటుందేమో అంటాడు మహేంద్ర. జగతి మనం ఎక్కువ ఆశపడుతున్నామేమో..విడివిడిగా చూస్తే.. వసు-రిషి ఎవరికి వారే ప్రత్యేకం కానీ మనం ఊహించనిది జరిగితే మళ్లీ మనం బాధపడాలి అంటుంది జగతి. మహేంద్ర.. నిప్పు-ప్రేమను దాచలేం..ఎంత దాచినా ఎప్పుడో అప్పుడు దానంతట అదే బయటపడుతుంది..ఇద్దరి మధ్యలో ఏముందో తెలియదు కానీ ఏదో ఒక టైమ్ లో ఎవరో ఒకరు బయటపడకపోరు, చుద్దాం ఏం జరుగుతుందో అంటాడు మహేంద్ర.

రెస్టారెంట్ లో

క్లాస్ లో వసుని తలుచుకుంటాడు రిషి. నిన్ను ఎలా అర్థంచేసుకోవాలి వసుధార..అప్పుడే తెలివైనదానిలా కనిపిస్తావ్, అంతలోనే చిన్నపిల్లలా చెస్తావ్ అనుకుంటాడు. మరోవైపు గౌతమ్ ఏంటో ఈ మాయ అనుకుంటూనేనెందుకు ఇండియాకు వచ్చాను, ఏం చేస్తాను.అంతా ప్రేమ మాయ అనుకుని..అటుగా వెళ్తున్న వసుధారను హలో వసుధార అని పిలుస్తాడు. అప్పుడు రిషి-గౌతమ్ ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుని షాక్ అవుతారు. గౌతమ్..రిషీని చూసి వీడేంటి నాకు ఇలా విలన్ లా తయారవుతున్నాడు అనుకుంటాడు. రిషీ గౌతమ్ ని పిలుస్తాడు. నువ్వేంట్రా ఇక్కడ ఉన్నవ్ అంటే..రిషీ బుక్ ఎగ్జమిషన్ జరుగుతుంటే వచ్చాను అంటూ ఎటకారంగా చెప్తాడు. అక్కడకు వచ్చిన వసుధార..సార్ మీ ఇద్దరూ వేర్వేరుగా వచ్చారా అని అడుగుతుంది. బిల్ మాత్రం ఒకటే అంటాడు గౌతమ్. రిషీ కాఫీ తీసుకురా వసూ పంపించేసి.. ప్రతిసారీ రెస్టారెంట్లో నీకేం పని నేనెప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటున్నావ్ అన్న రిషితో.. నేను వచ్చిన ప్రతీసారీ నువ్వొస్తున్నావ్ ఆ లాజిక్ మరిచిపోతున్నావ్ అంటాడు గౌతమ్. నువ్వెందుకు వస్తున్నావో నేనూ అందుకే వస్తున్నా అని షాకిచ్చిన రిషి..కాఫీ తాగేందుకు అని చెబుతాడు. ఇంతలో చిన్న సర్ ప్రైజ్ అంటూ వసుతో దిగిన సెల్ఫీ చూపిస్తాడు గౌతమ్. అది చూసి రిషీకి కోపంతో నోటమాటరాదు.. అలా ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version