దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ రంగంలోకి దిగడం ఖాయమైంది. ఇప్పటికే ఆ పార్టీ కీలక నేత రఘునందన్ రావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనే అభ్యర్దిగా కొద్దిసేపటి క్రితం తెలంగాణా బీజేపీ ప్రకటించింది. ఇక కాంగ్రెస్ లో మాజీ మంత్రి ముత్యంరెడ్డి తనయుడి పేరు వినిస్తోంది. ఇక టీఆర్ఎస్ నుంచి మృతిచెందిన రామలింగారెడ్డి తనయుడు పోటీలో ఉంటారా ? లేదా మరో నేత పోటీలో ఉంటారా ? అన్నది చూడాలి.
అయితే అందరూ ఊహించినట్లుగానే బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. ఇప్పటికే దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి 2014, 2018 ఎన్నికల బరిలో నిలిచిన రఘునందన్ రావు రెండు సార్లూ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. 2001లో టీఆర్ఎస్ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన రఘునందన్ రావు అప్పటి నుండీ ఎన్నికల్లో ఓటమిపాలవుతూ వస్తున్నారు.