దుబ్బాక ఉప ఎన్నికకు నేటితో ముగియనున్న ప్రచార పర్వం

-

తెలంగాణా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన దుబ్బాక ఉప ఎన్నికల ప్రచార పర్వం నేటితో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే గడువు ఉండగా మిగిలిన ఈ ఒక్క రోజుని గట్టిగా ప్లాన్ చేసుకున్నాయి రాజకీయ పార్టీలు. ఈ నెల 3న అంటే ఎల్లుండి పోలింగ్‌ జరగనుండగా 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమయింది.

సిట్టింగ్‌ సీటు కావడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్య సుజాతను అధిష్టానం రంగంలోకి దించింది. ఇక ఎప్పటి లానే గెలుపు పూర్తి బాధ్యతను మంత్రి హరీశ్‌రావుకే అప్పగించింది. ఇక ఈ ఎన్నికను కాంగ్రెస్, బీజేపీలు కూడా సీరియస్ గా తీసుకున్నాయి. బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌ రావు పేరు ఖరారు కాక ముందే ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఇక, కాంగ్రెస్‌ సైతం దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. టీఆర్ఎస్ నుండి తెచ్చి మరీ అభ్యర్థిగా చెరుకు శ్రీనివా్‌సరెడ్డిని ఎంపిక చేయడమే కాకుండా.. వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తూ గెలిచేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version