కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవుతోంది..రోజువారీ కేసుల సంఖ్యలు పెరుగుతుండటంతో మళ్లీ లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి ప్రపంచ దేశాలు..కరోనా రెండోదశ వ్యాప్తి చాలా ప్రమాదంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది..తొలిసారి వచ్చినదానికన్నా రెండోసారి వచ్చే కరోనా సంక్షోభంలో అత్యధికులు మరణిస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు..చాలా దేశాలు ఇప్పడు మళ్లీ కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం అయిన లాక్ విధానం అమలు చేయాలని నిర్ణయించాయి..అమెరికా, ఐరోపాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో ప్రతిరోజూ దాదాపు లక్ష వరకు కొత్త కేసులు వస్తున్నాయి..యూఎస్‌లో మొత్తం కేసుల సంఖ్య 94 లక్షలకు చేరువ అవుతోంది..దీంతో చాలాదేశాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి..ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బెల్జియంలో లాక్‌డౌన్ ప్రకటించగా..బ్రిటన్‌కూడా ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ఇవాళ రాత్రి నుంచి మళ్లీ లాక్ డౌన్..ఐరోపా దేశాల్లో కరోనా సెకండ్ వేవ్..
-