సెప్టెంబర్ 26 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు

-

ఏపీలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి విజయదశమి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈనెల 26 నుంచి దసరా ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. పది రోజులపాటు సాగే ఉత్సవాల్లో వివిధ అలంకారాల్లో అమ్మవారి భక్తులను అనుగ్రహించనున్నట్లు చెప్పారు.  మూలా నక్షత్రం రోజు ఏపీ సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో వెల్లడించారు. ఈ ఏడాది కూడా అంతరాలయ దర్శనాలు ఉండవన్నారు. భక్తులకు గతంలో మాదిరిగానే రూ.100, రూ.300, టికెట్ల దర్శనాలతో పాటుగా, ఉచిత దర్శనాలను కొనసాగించనున్నట్లు అమె తెలిపారు.

కరోనా తగ్గడంతో 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దసరా మహోత్సవాలకు టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు. ఘాట్ రోడ్డులో క్యూలైన్ల ఏర్పాటు పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంపై సమన్వయ కమిటీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లుగా వెల్లడించారు. కుంకుమార్చనలో పాల్గొనే వారికోసం 20 వేల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఉంచుతున్నట్లు తెలిపారు. గతంలో మాదిరిగానే నగరోత్సవం నిర్వహిస్తాంమని ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు. భవానీ భక్తులు దర్శనాలకే రావాలని.. మాల వితరణకు అవకాశం లేదంటూ ఈవో సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version