ఆధార్ ఉంటే E-PAN కార్డ్‌ని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఎలా అంటే..

-

ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు ఈరోజుల్లో చాలా ముఖ్యమైన పత్రాలు. బ్యాంక్ ఖాతా తెరవడానికి, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ తీసుకోవడానికి లేదా ITR ఫైల్ చేయడానికి ఇలా ప్రతిచోటా పాన్ కార్డ్ తప్పనిసరి అయిపోయింది. ఆధార్‌ కార్డును ఆన్‌లైన్‌లో ఎలా డౌన్‌ లోడ్ చేసుకోవాలో అందరికీ తెలుసు. కానీ ఈ పాన్‌ కార్డును ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో తెలియదు. పాన్‌ కార్డుపోతే..మీరు ఈ- పాన్‌ కార్డును వాడుకోవచ్చు. ఈ-పాన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆధార్ నంబర్ సరిపోతుంది. ఇంకెందుకు లేట్‌.. ఎలా డౌన్‌లోడ్‌ చేయాలో తెలుసుకుందామా..!

ఆధార్ నంబర్‌ని ఉపయోగించి పాన్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా

1. ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportalకి లాగిన్ చేయండి.
2. ఇప్పుడు ‘ఇన్‌స్టంట్ ఇ పాన్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3. దీని తర్వాత, ‘కొత్త E PAN’పై క్లిక్ చేయండి.
4. మీ పాన్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి.
5. మీకు మీ పాన్ నంబర్ గుర్తులేకపోతే, మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
6. ఇక్కడ నిబంధనలు, షరతులు ఇవ్వబడ్డాయి, వాటిని జాగ్రత్తగా చదివి, ఆపై ‘అంగీకరించు’పై క్లిక్ చేయండి.
7. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌పై OTP వస్తుంది, దానిని నమోదు చేయండి.
8. ఇచ్చిన వివరాలను చదివిన తర్వాత ‘నిర్ధారించు’ బటన్‌పై క్లిక్ చేయండి.
10. ఇప్పుడు మీ PAN కార్డ్ PDF ఫార్మాట్‌లో మీ ఇమెయిల్ ఐడికి పంపబడుతుంది.
11. మీరు మీ ‘e-PAN’ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అంతే ఆన్‌లైన్‌లో ఈజీగా ఈ-పాన్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే ఇంకో విషయం.. ఎప్పుడైనా సరే.. పాన్‌కార్డులో, ఆధార్‌ కార్డులో మీ వివరాల ఒకేలా ఉండాలి. ఎలాంటి స్పెల్లింగ్‌ మిస్టేక్‌ ఉండకూడకదు. ఆఖరికి.. ఆధార్‌ కార్డులో ఇంటిపేరు ముందు ఉండి, ఆ తర్వాత మీపేరు ఉంటే.. పాన్‌ కార్డులో మీ పేరు ముందు ఉండి ఆ తర్వాత ఇంటి పేరు ఉన్నా కూడా కొన్నిసార్లు సమస్యే అవుతుంది. ముఖ్యంగా ఐపీబీబీ అకౌంట్‌ ఓపెన్‌ చేసేప్పుడు పాన్‌కార్డును తీసుకోదు. కాబట్టి రెండు కార్డుల్లో వివరాలు ఒకేలా ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version