అలర్ట్.. కెనడాలో విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి!,

-

కెనడా వెళ్లి చదువుకోవాలనుకే విద్యార్థులకు అలర్ట్. అక్కడి ప్రభుత్వం త్వరలో తీసుకోబోయే కీలక నిర్ణయం భారత విద్యార్థులపై పడే అవకాశం కనిపిస్తోంది. ఆ దేశంలో నిరుద్యోగం, ఇళ్ల కొరత పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం ఆ దేశంలో నివసిస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి విధించేందుకు సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలోనే కెనడా కేంద్ర సర్కార్‌ అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించనున్నట్లు ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ వెల్లడించారు. వాస్తవానికి ఈ అంశాన్ని నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం పరిస్థితి అదుపు తప్పి పెద్ద ఎత్తున విదేశీ విద్యార్థులు వచ్చి చేరారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పరిమితి ఏ స్థాయిలో ఉంటుందనే విషయాన్ని మాత్రం కచ్చితంగా చెప్పలేం. చాలా విద్యాసంస్థల ఆదాయ వనరులపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాంరు. కెనడా ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఇళ్ల సంఖ్యతో పోలిస్తే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉంది. ఈ నేపథ్యంలో శ్రామిక శక్తి సగటు వయసును తగ్గించాలని వస్తున్న డిమాండ్లనూ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని మిల్లర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version