రేపు తెలంగాణ ఎంసెట్ ఎంట్రెన్స్ (ఇంజనీరింగ్ స్ట్రీమ్) ఫలితాలు వెలువడనున్నాయి. గత నెల 9,10,11,14 తేదీల్లో ఈ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష కోసం లక్షా 43 వేల 332 మంది దరఖాస్తు చేసుకుంటే లక్షా 19 వేల 187 మంది హాజరయ్యారు. హాజరు శాతం 83.15% ఉంది. ఇక ఈ ఫలితాలు రేపు ప్రకటించగానే ఇంజినీరింగ్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ ఎంసెట్ పరీక్షలకు కరోనా వైరస్ ప్రభావం దృశ్యం వివిధ కారణాలతో కొంత మంది విద్యార్థులు హాజరు కాలేకపోయారు.
ఇక ఇలాంటి విద్యార్థులందరికీ తెలంగాణ విద్యాశాఖ సువర్ణ అవకాశాన్ని అందించింది. కరోనా వైరస్ కారణంగా ఎంసెట్ రాయ లేకపోయినా విద్యార్థులు అందరూ వెంటనే వివరాలు అందించాలని అంటూ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ రెండ్రోజుల్ క్రితం విద్యార్థులను కోరారు. ఈరోజు వరకు విద్యార్థులకు వివరాలు పంపించేందుకు అవకాశం ఉంది అని ఆయన తెలిపారు. అయితే విద్యార్థుల హాల్ టికెట్ తో పాటు… కరోనా సోకినట్లు గా తెలిపేలా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వాలని సూచించారు. ఇక ఇలా ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.