సేవింగ్స్ అకౌంట్ లోని డబ్బుతో ఎక్కువ వడ్డీ పొందిండిలా ?

-

బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులకు ఎక్కువ వడ్డీ రావడం లేదని నిరాశ చెందుతున్నారా? తక్కువ వడ్డీ వస్తుందని భావిస్తున్నారా.. అయితే మీకు ఓ ఆఫ్షన్ అందుబాటులో వచ్చింది. బ్యాంక్ అకౌంట్ తో మీరు అలా చేస్తే మీకు అధిక వడ్డీ వస్తుంది.

cash
cash

చాలా మంది బ్యాంక్ వినియోగదారులు తమ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు సేవింగ్స్ అకౌంట్ లో మనీ దాచి పెట్టుకుంటారు. అత్యవసర సమయాల్లో డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి మనీ సేవింగ్స్ లో పెట్టుకుంటారు. అయితే మీకు సేవింగ్స్ అకౌంట్ లో మీ డబ్బుకు ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? సేవింగ్స్ లో పెట్టిన డబ్బులతో కూడా ఎక్కువ వడ్డీని పొందవచ్చు. ఈ ఆఫ్షన్ చాలా తక్కువ మంది వినియోగదారులకు తెలుసు.

బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులతో ఎక్కువ వడ్డీని పొందే సదుపాయం ఉంది. బ్యాంక్ ఖాతాలో ఉండే ‘స్వైప్ ఔట్-స్వైప్ ఇన్’ ఆఫ్షన్ తో ఎక్కువ వడ్డీని పొందవచ్చు. చాలా బ్యాంకులు ఈ ఆఫ్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ స్కీంలో మీ చేరిన వారి అకౌంట్ లోని ఎక్కువ డబ్బులు ఆటోమేటిక్ గా ఫిక్స్ డ్ డిపాజిట్ కిందికి వెళ్తాయి. అప్పుడు ఆటోమేటిక్ గా ఎక్కువ వడ్డీని సంపాదించుకోవచ్చు.

ఫిక్స్ డ్ డిపాజిట్ లో సేవింగ్స్ అకౌంట్ ను క్రిమేట్ చేసుకోవాలి. లేదా, సేవింగ్స్ అకౌంట్ ను ఎఫ్ డీ లింక్ కు యాడ్ అవ్వాలి. అలా చేస్తే మీ డబ్బులు ఆటోమేటిక్ గా ఫిక్స్ డ్ డిపాజిట్ లోకి వెళ్లి డబ్బులు రెండింటికీ అధిక వడ్డీ చేరుతుంది.

బ్యాంకులు ఈ ఫెసిలిటీని అందిస్తోందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక్కో బ్యాంకు ఈ ఆఫ్షన్ ను ఒక్కో పేరుతో పిలుస్తోంది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ (మనీ మ్యాగ్జిమైజ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సేవింగ్స్ ప్లస్ అకౌంట్), బ్యాంక్ ఆఫ్ బరోడా (ఎడ్జ్ సేవింగ్స్) పేరుతో ఈ ఆఫ్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. మీ అకౌంట్ ఎంత డబ్బు ఉండాలనే విషయాన్ని మీరే నిర్ణయించుకోవాలి. అలా మీరు నిర్ణయించిన డబ్బుకు అధికంగా ఆటోమెటిక్ గా ఎఫ్ డీ అకౌంట్ లోకి వెళ్లిపోతాయి. దీంతో మీరు ఎక్కువ వడ్డీని సులభంగా పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news