అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.9 గా నమోదు.

-

అండమాన్ నికోబార్ దీవులు మరోసారి ఉలిక్కి పడ్డాయి. ఆదివారం భూకంపం సంభవించింది. దీంతోఅం జనాలు భయాందోళనకు లోనయ్యారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని డిగ్లిపూర్‌లో భూకంప సంభవించినట్లు.. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.9 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది. దిగ్లీపూర్ కు ఉత్తర వాయువ్యంగా భూకంప కేంద్రం కేంద్రీక్రుతం అయింది. భూమికి 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.

ఇటీవల కాలంలో దేశంలో తరుచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇవన్నీ రిక్టర్ స్కేల్ పూ 4 తీవ్రత కన్నా తక్కువగానే ఉండటంతో పెద్దగా ప్రమాదాలు ఉండటం లేదు. ఆస్తి, ప్రాణ నష్టాలు ఏర్పడటం కాస్త ఉపశమనం కలిగించే అంశం. ఇటీవల కాలంలో మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించాయి. ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల్లో, హిమాలయ రాష్ట్రాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version