దిల్లీలో స్వల్ప భూకంపం సంభవించింది. ఒక్కసారిగా ప్రజలంతా భయాందోళనకు గురై రోడ్లుపైకి పరుగెత్తారు. ఇవాళ మధ్యాహ్నం 2.28 గంటల సమయంలో దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. భూప్రకంపనలు రాగానే.. స్థానికులు బెంబేలెత్తిపోయారు. వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి.
అయితే నేపాల్‌లో సంభవించిన భూకంపం ధాటికి దిల్లీలో ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌కు తూర్పున 148 కిలోమీటర్ల దూరంలో నేపాల్‌లో భూకంప కేంద్రం మధ్యాహ్నం 2:28 గంటలకు సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌కు తూర్పున 148 కిలోమీటర్ల దూరంలో నేపాల్‌లో సంభవించింది.