తైవాన్​లో మరోసారి భారీ భూకంపం.. యూలిలో చిక్కుకుపోయిన పర్యాటకులు

-

తైవాన్​ను మరోసారి భారీ భూకంపం అతలాకుతలం చేసింది. ఆదివారం సంభవించిన భూకంపంల వల్ల భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈసారి వచ్చిన భూకంపం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరగలేదని వెల్లడించారు. తైవాన్​ ఉత్తర ప్రాంతంలోని తైపీలో భూమి కంపించింది. యూలీలోని ఓ రహదారి పైనున్న వంతెన​ నేలమట్టమైంది. ఆ సమయంలో బ్రిడ్జ్​పై వెళ్తున్న వాహనాలు శిథిలాల కింద చిక్కుకోగా రక్షణ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

In this photo provided by Hualien City Government, firefighters are seen at a collapsed building during a rescue operation following an earthquake in Yuli township, Hualien County, eastern Taiwan, Sunday, Sept. 18, 2022. A strong earthquake shook much of Taiwan on Sunday, toppling at least one building and trapping two people inside and knocking part of a passenger train off its tracks at a station.(Hualien City Government via AP)

అదే ప్రాంతంలోని ఓ మూడంతస్తుల భవనం సైతం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఒక్కరిని సురక్షితంగా బయటకు తీయగా మరో ముగ్గురిని రెస్క్యూ సిబ్బంది వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాయున్​ పట్టణంలోని ఓ స్పోర్ట్స్​ సెంటర్​లోని ఐదవ అంతస్తులో ఉన్న గది సీలింగ్​ విరిగిపడింది. ఈ ఘటనలో ఓ 36 ఏళ్ల వ్యక్తి గాయపడ్డారు.

‘ఆరెంజ్ డే లిల్లీస్‌’కు ప్రసిద్ధి చెందిన యులిలోని పర్వతంపై కొండచరియలు విరిగిపడగా అక్కడున్న దాదాపు 400 మంది పర్యాటకులు చిక్కుకుపోయారని సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. విద్యుత్​ లేక, ఫొన్​ సిగ్నల్స్​ దొరకక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించింది. మరోవైపు.. తైవాన్ సమీపంలోని అనేక దక్షిణ జపాన్​ దీవులకు జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. వాటిని తర్వాత ఉపసంహరించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version