చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు బోల్తా పడిన ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గయ్ఝౌ రాష్ట్ర రాజధాని గుయాంగ్ నగరంలోని ండూ కౌంటీలో ఈ ప్రమాదం జరిగింది.
ఎక్స్ప్రెస్వే పై బస్సు బోల్తా పడిన సమయంలో అందులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఘటనపై వివరాలను ఆరా తీస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.