ఇక సులభంగా ఆధార్‌పై ఇంటి నంబర్‌ మార్చుకోవచ్చు!

-

మీరు ఈ మధ్య కొత్త ఇంటికి షిఫ్ట్‌ అయ్యారా? మీ ఆధార్‌ కార్డు పై ఉన్న పాత ఇంటి నంబర్‌ను కొత్త ఇంటి అడ్రస్‌కు మార్చాలనుకుంటున్నారా? దీనికి యూఐడీఏఐ మనకు చింత లేకుండా ఇంటి అడ్రస్‌ మార్చుకునే వెసులుబాటును తీసుకువచ్చింది. ఇక పై ఏ అడ్రస్‌ ప్రూఫ్‌ లేకుండానే మీ ఆధార్‌ కార్డుపై ఉన్న అడ్రస్‌ ను మార్చుకోవచ్చు.


ఆన్‌లైన్‌లోనే అడ్రస్‌ వాలిడేషన్‌ లెటర్‌ ద్వారా మార్పులు చేసుకోవచ్చని యూఐడీఏఐ ప్రకటించింది. అడ్రస్‌ మార్పులు చేసుకునేవారు ఇంటి యజమాని అయినా, వారి ఇంటిలోని ఏ వ్యక్తేనా అడ్రస్‌ వాలిడేషన్‌ లెటర్‌ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
దీనికి ఇంటి యజమాని ఫోన్‌నంబర్, అడ్రస్‌ మార్పు చేసుకుంటున్న వ్యక్తి ఫోన్‌ నంబర్‌ ఆధార్‌ కార్డుకు లింక్‌ అయి ఉండాలి.
ఓటీపీ ని అడ్రస్‌ వెరిఫై చేసే వ్యక్తి (యజమాని) ధ్రువీకరించాలి.
అడ్రస్‌ వెరిఫైయర్‌ ఇంటి అడ్రస్‌ మార్చుకోవడానికి సమ్మతించాలి.
మరిన్ని వివరాలకు http//uidai.gov.in/ పై క్లిక్‌ చేయాలి
ఆ తర్వాత ‘my address’ మెనులోని ‘address validation’ పై క్లిక్‌ చేయాలి. అప్పుడు అడ్రస్‌ లెటర్‌ పేజీలో 12 డిజిట్ల ఆధార్‌ సంఖ్యను నమోదు చేయాలి. లేకపోతే 16 డిజిట్ల వర్చువల్‌ ఐడీ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.
ఆ తర్వాత ‘క్యాప్చా’ ఎంటర్‌ చేసి, ఓటీ పీ సెండ్‌ చేయమని క్లిక్‌ చేయాలి. ఓటీపీ వచ్చాక..
ౌజజీn అయి డీటెయిల్స్‌ను నింపాలి, ఇంటి యజమాని ఆధార్‌ నంబర్‌ కూడా అవసరం.
అడ్రస్‌ ధ్రువీకరణకు ఇంటి ఓనర్‌ మొబైల్‌కు లింక్‌ వస్తుంది. వెరిఫై చేయాల్సి ఉంటుంది.
రెండోసారి ఓటీపీ వస్తుంది. ఎంటర్‌ చేసి ‘క్యాప్చా’ రాసిన తర్వాత వెరిఫై అవుతుంది.
చివరగా సర్వీస్‌ రిక్వెస్ట్‌ నంబర్‌ (ఎస్‌ఆర్‌ఎన్‌) మెసేజ్‌ వస్తుంది.
దీని ద్వారా మన దరఖాస్తు పత్రం నమూన చూడవచ్చు. ఏవైన మార్పులు కూడా చేసుకోవచ్చు. అప్డెడ్‌ రిక్వెస్ట్‌ నంబర్‌ (యూఆర్‌ఎన్‌) ద్వారా రద్దు కూడా చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news