పాన్ కార్డు మనకి ఎంతో ముఖ్యం. పన్ను చెల్లించే ఎవరికైనా పాన్ కార్డ్ అవసరం. ఆర్థిక లావాదేవీలు చేసేందుకు కూడా ఇది ముఖ్యం. అందుకని పాన్ కార్డుని భద్రంగా ఉంచుకోవాలి. అలానే చాలా మంది పాన్ కార్డు లో ఏదైనా సమస్య ఉంటే ఇబ్బంది పడుతుంటారు.
మీకు కూడా ఏదైనా సమస్య వుందా…? మీకూ సమస్య ఉంటే ఇలా చెయ్యండి. పాన్ కార్డ్‌లో ఏదైనా సమస్య వున్నా మీ పాన్ కార్డు రాకపోయినా ఇలా చెయ్యండి. ఈ సమస్యలు ఉంటే NSDLని సంప్రదించవచ్చు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) లేదా ఆదాయపు పన్ను శాఖను మీరు సంప్రదిస్తే మీకు పాన్ కార్డు వచ్చేస్తుంది.
ఇక వాళ్ళను ఎలా సంప్రదించాలి అనేది చూస్తే.. ఆదాయపు పన్ను శాఖ లేదా ఎన్‌ఎస్‌డిఎల్‌ని వెబ్‌సైట్ ద్వారా సంప్రదించవచ్చు. లేదంటే ఫోన్ చెయ్యచ్చు. ఆదాయ పన్ను శాఖ నెంబర్ 1800-180-1961. SSDL-020-27218080. లేదంటే మీరు NSDLPAN <space> రసీదు సంఖ్యను 57575కు
SMS పంపాలి.
ఇలా ఈజీగా మీరు సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు. కావాలంటే మీరు మెయిల్ అయినా సరే చెయ్యచ్చు. ఈ విధానంలో సులభంగా పాన్ కార్డుకి సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు అవుతుంది.
.