పులివెందులలో కంటే ఎక్కువ మెజారిటీతో కుప్పంలో గెలుస్తాం – డిప్యూటీ సీఎం నారాయణస్వామి

-

చంద్రబాబు పై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ…పేదవారిని దగ్గర తీసుకున్న చరిత్ర నీకుందా చంద్రబాబు…సత్య హరిశ్ఛంద్రుడిని జగన్ రూపంలో చూశామన్నారు. 175 సీట్లు గెలిచేందుకు కుప్పం నాంధి పలుకుతుంది…పులివెందులకు ధీటుగా కుప్పంలో మెజారిటీ రాబోతోందన్నారు.

దొంగ ఓట్లతో 6 పర్యాయాలు గెలిచావ్ చంద్రబాబు…ఏనాడైనా పేదల అకౌంట్లలో రూపాయి అయినా వేశావా ? అని ప్రశ్నించారు. కుప్పం ఎప్పుడొచ్చినా చంద్రబాబు రచ్చ పచ్చ చేస్తాడు…చంద్రబాబు…ఔరంగజేబు ఒక్కటేనని….మామను వెన్ను పోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని నిలదీశారు.నీ తమ్ముడుని మానసిక సంక్షోభంతో ఇంటికే పరిమితం చేశావ్ అని…చంద్రబాబు పగ, ఈర్ష్య, ద్వేషంతో పుట్టాడు అని మండిపడ్డారు. ఎస్సీలకు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని…కుల,మతాలను రెచ్చగొట్టే వ్యక్తి నువ్వు అని ఆగ్రహించారు. దమ్ముంటే పోలీసులు లేకుండా రానాలని సవాల్ విసరడమ కాదు…జడ్ కేటగిరీ భద్రత లేకుండా నువ్వు బయటికి రాగలవా అని ప్రశ్నించారు నారాయణ స్వామి.

Read more RELATED
Recommended to you

Exit mobile version