పుచ్చకాయని తింటే హ్యాపీగా ఉందని అధికంగా తింటున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు..!

-

పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వేసవిలో పుచ్చకాయ తింటే పోషక పదార్థాలతో పాటు ఎక్కువ నీళ్లు కూడా మనకి అందుతాయి. అలానే సమస్యను కూడా తొలగిస్తుంది పైగా ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పుచ్చకాయను వేసవి లో తీసుకోవడం వల్ల బాడీ చల్లగా ఉంటుంది అలానే అద్భుతమైన ప్రయోజనాలను మనం ఎన్నో పొందొచ్చు.

పుచ్చకాయ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు:

దాహం ఎక్కువగా వేస్తున్నప్పుడు పుచ్చకాయ తీసుకుంటే వెంటనే దాహం తగ్గుతుంది.
మంట లాంటివి కలిగినప్పుడు పుచ్చకాయను తీసుకుంటే ఆ సమస్య నుండి బయట పడవచ్చు.
ఇంఫ్లమేషన్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
అనేక రకాల పోషక పదార్థాలు కూడా మనకి అందుతాయి.
పుచ్చకాయ గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని ఎక్కువగా తింటున్నారా..? కానీ పుచ్చకాయను అతిగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు.

పుచ్చకాయను అతిగా తీసుకుంటే వచ్చే సమస్యలు:

పుచ్చకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా సమస్యలు కలుగుతాయి. అతిగా దీనిని తీసుకోకూడదు. ఎప్పుడూ కూడా దీనిని లిమిట్ గానే తినాలి. బ్లోటింగ్, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు అతిగా పుచ్చకాయ తింటే కలుగుతాయి. అందుకనే పుచ్చకాయని మోడరేట్ గానే తీసుకోవాలి. ఎప్పుడూ కూడా భోజనంతో పాటు పుచ్చకాయ తీసుకోకూడదు.

పుచ్చకాయ తీసుకోవడానికి మంచి సమయం ఏది..?

పుచ్చకాయను తీసుకోవడానికి మంచి సమయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. లేదంటే సాయంత్రం ఐదు గంటలకి తీసుకోవచ్చు. స్నాక్స్ గా తీసుకుంటే కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు. డయాబెటిస్ మరియు జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళు పుచ్చకాయ తీసుకోకుండా ఉంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version