వరి కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయ నాటకం ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో దిగుబడి వస్తున్నా.. ముదునష్టపు టీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరవలేదని… ఎప్రిల్ మొదటి వారంలో వరి కల్లాల్లోకి వచ్చిన బస్తాలు కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు. రైతులను టీఆర్ఎస్, బీజేపీ ఎలా దగా చేస్తున్నాయో రాహుల్ గాంధీ సభ ద్వారా వివరిస్తామని అన్నారు. ప్రతీ మిర్చి రైతు ఎకరాకు లక్ష పెట్టుబడి పెట్టి నష్టపోయాడని… అయినా కేసీఆర్ ప్రభుత్వ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
రాహుల్ గాంధీ సభలో రైతు రుణమాఫీ, కౌలు రైతుల సంక్షేమంపై కీలక ప్రకటన: ఉత్తమ్ కుమార్ రెడ్డి
-