మూసీ ప్రభావిత ప్రాంతంలో ఈటల బ్రేక్ ఫాస్ట్

-

రాష్ట్ర ప్రభుత్వం మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా ఇటీవల నల్గొండ జిల్లాలో పర్యటించి త్వరలోనే ప్రక్షాళన ప్రారంభిస్తామని పేర్కొంది.ఈ సందర్భంగా మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్, బీజేపీ అడ్డుపడుతున్నాయని సీఎం రేవంత్ ఆరోపించారు. ఈ సందర్బంగా రేవంత్ విసిరిన సవాల్‌ను బీజేపీ నేతలు స్వీకరించారు. ఈ క్రమంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు బస్తీ నిద్రలు చేశారు.

ఈ క్రమంలోనే నేటి ఉదయం బీజేపీ మూసీ నిద్రలో భాగంగా ఉదయాన్నే న్యూ మారుతినగర్, సత్య నగర్ కాలనీ లో మూసి బాధితులను కలిసి, మూసీ పరివాహక ప్రాంతాలను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పరిశీలించారు. అనంతరం అక్కడే బ్రేక్ ఫాస్ట్ చేశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని హామీ నిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version