రాష్ట్రంలో ప్రస్తుతం ఐకేపీ సెంటర్ల వద్ద ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతోంది. రైతులు తాము పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. అయితే, కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న ప్రక్రియను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదివారం ఉదయం పరిశీలించారు. తన వాహనంలో ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా..మార్గమధ్యలో సూర్యాపేట జిల్లాలోని టేకుమట్ల ఐకేపీ కేంద్రం వద్ద ఆగారు.
అనంతరం అక్కడి రైతులతో కాసేపు ముచ్చటించారు. రైతులు తీసుకొచ్చిన వడ్లను పరిశీలించారు.తాలు లేకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు. అలా చేస్తే మంచి ధర వస్తుందని సూచించారు. ఇక పంట వ్యర్థ్యాలను కాల్చొద్దని, ఇదే విషయాన్ని మిగతా రైతులకు కూడా చెప్పాలని సూచించారు.అలా చేస్తే భూమిలోని సారం తగ్గిపోతుందని వివరించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు.