Ebay: ఈబే నుండి వెయ్యి మంది ఉద్యోగులు అవుట్..!

-

కాలిఫోర్నియా కి సంబంధించిన మల్టీ నేషనల్ ఆన్లైన్ రిటైల్ కంపెనీ ఈబే పెద్ద ఎత్తున ఉద్యోగాలు అని తొలగించేసింది వివరాల్లోకి వెళితే సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 1,000 మంది ఉద్యోగులని తొలగిస్తున్నట్లు చెప్పింది. ఉద్యోగుల వేతనాల బిల్లు కంపెనీ వ్యవహారాల ఖర్చు వ్యాపారానికి మించి ఉందని ఇంకోపక్క ఆర్థిక మాంద్యం పరిస్థితులు కారణంగా లే ఆఫ్ ప్రకటించక తప్పట్లేదని ఈబే కంపెనీ చెప్పింది.

ఈబే కంపెనీ సీఈవో జామి లానోన్ నుండి సంస్థ ఉద్యోగులకు తొలగిస్తున్నట్లు సందేశాలని పంపించారు. జూమ్ కాల్స్ లో ఆయా ఉద్యోగులకి లే ఆఫ్ సమాచారాన్ని టీం లీడర్లు వివిధ విభాగాల హెచ్వోడీలు అందజేస్తానని చెప్పారు. కరోనా టైం లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆన్లైన్ లావాదేవీలు చేశారు. ఆయా టెక్ కంపెనీలు తమ సిబ్బందిని దీంతో పెంచుకున్నాయి అయితే ఇప్పుడు మార్జిన్ ని పెంచుకోవడానికి పలు కంపెనీలు లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version