Breaking : జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్‌.. కంపెనీ ఆస్తులు అటాచ్‌

-

భారత్‌ స్టాండర్డ్స్‌ (బీఎస్‌)-3 ప్రమాణాలు కలిగిన లారీలను బీఎస్‌-4 వాహనాలుగా మార్చారనే ఆరోపణల నేపథ్యంలో గత జూన్‌లో ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. అనంతపురం, హైదరాబాద్, తాడిపత్రిలో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో, కుటుంబీకుల ఇళ్లల్లో గతంలో సోదాలు జరిగాయి. అయితే తాజాగా.. జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకుంది. 22.10 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఈడీ. జేసీ అనుచరుడు గోపాల్ రెడ్డి ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది ఈడీ.

గోపాలర్ రెడ్డి ఆస్తులను… జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోనూ, ఆయన అనుచరుడు గోపాల్ రెడ్డి ఇంట్లోనూ ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బీఎస్ 4 వాహనాలను రిజిస్ట్రేషన్లు చేయించి విక్రయించిన కేసులో ఈడీ దర్యాప్తు చేసింది. దీనిపై సోదాలు జరిపిన ఈడీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు జేసీ కంపెనీకి చెందిన ఆస్తులను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version