ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో KTRకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో జనవరి 7న విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది ఈడీ. ఇక కేటీఆర్ తో పాటు… సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి.
ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద విచారణ చేస్తున్న ఈడీ… పెమా నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు ఇప్పటికే గుర్తించిందట. FEOకు 55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్న ఈడీ… ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో జనవరి 7న విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఇక ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో KTRకు ఈడీ నోటీసులు అందిన తరుణంలో.. బీఆర్‌ఎస్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.