దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. YSRCP ఎంపీ మాగుంటకు ఈడీ నోటీసులు

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ స్కామ్ లో తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులకు ఈడీ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించిన ఈడీ తాజాగా ఏపీలోని వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి అరెస్టయి జైలులో ఉన్నారు.

దిల్లీ లిక్కర్ పాలసీలో సిండికేట్‌ ఏర్పాటు, ముడుపులు ముట్టజెప్పడంలో.. మాగుంట రాఘవ్‌ కీలకపాత్ర పోషించారని ఈడీ ఇప్పటికే స్పష్టం చేసింది. దిల్లీ మద్యం విధానంలో మద్యం ఉత్పత్తిదారులకు రిటైల్‌ జోన్లు ఉండరాదనే నిబంధనకు విరుద్ధంగా.. మాగుంట ఆగ్రో ఫామ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో దిల్లీలో రెండు రిటైల్‌ జోన్లను రాఘవ తన గుప్పిట్లో పెట్టుకున్నారని ప్రస్తావించింది.

మాగుంట ఆగ్రోఫామ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ భాగస్వాములుగా కాగితాల్లో పేర్కొన్న పేర్లన్నీ డమ్మీలేనని ఈడీ ఇప్పటికే కోర్టుకు తెలిపింది. తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ద్వారానే రాఘవ్‌.. మద్యం వ్యాపారంలో భాగస్వామ్యం దక్కించుకున్నట్లు ఈ కేసులో నిందితుడుగా ఉన్న సమీర్‌ మహేంద్రు స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు ఈడీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version