హైదరాబాదులో మరోసారి ఈడీ రైడ్స్..

-

Ed Rides in Hyderabad: హైదరాబాదులో మరోసారి ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. సురాన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. చైర్మన్ నరేందర్ సురాన, ఎండి దేవేందర్ సురానా ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. మనీలాండరింగ్ తో పాటు విదేశాలకు డబ్బులు తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ED raids in Hyderabad once again

బోయిన్ పల్లిలోని అరియాంత్ కార్డ్ మాస్టర్ ఎంక్లేవ్ లోని విల్లాల్లో సోదాలు జరుగుతున్నాయి.  కాగా రేపు హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నిరసనలు, ధర్నా జరుగనుంది. బీజేపీ, ప్రధాని మోదీ రాజకీయ కక్ష సాధింపు ధోరణికి వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమాలు జరుగనున్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చార్జిషీటులో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగనున్నాయి. ఈ నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తరలిరావాలని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు టీపీసీసీ పిలుపునిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news