మరో 5 రోజుల్లో DSC నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు మంత్రి నారా లోకేశ్. 16,347 పోస్టుల మెగా DSC పై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. SC వర్గీకరణ ప్రక్రియ ముగిసిన తర్వాతే DSC ప్రక్రియకు వెళ్లాలని నిర్ణయించినందున నోటిఫికేషన్ ఆలస్యమైందని తెలిపారు.

తాజాగా SC కమిషన్ నివేదికపై క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, రాబోయే రెండు రోజుల్లో ఆర్డినెన్స్ విడుదల చేసి, తదుపరి 5 రోజుల్లో DSC నోటిఫికేషన్ రిలీజ్ కానుందన్నారు మంత్రి నారా లోకేశ్. జూన్ 30వ తేదీ నాటికి వాట్సాప్ ద్వారా 500 రకాల పౌరసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. 100 రోజుల్లో ఏఐ ఆధారిత వాయిస్ ఎనేబుల్ సేవలు తీసుకొస్తామన్నారు. కేవలం 10 సెకన్లలోనే పౌరులకు సేవలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అన్నారు నారా లోకేశ్.