టీఆర్ఎస్ కు షాక్ : ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు

-

అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ముమ్మర సోదాలు చేశారు ఈడీ అధికారులు. అంతేకాదు.. నామాకు చెందిన ఖమ్మం, హైదరాబాద్ లలో ఉన్న ఆఫీసుల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేశారు. “Madhucon Company” పేరుతో పలు బ్యాంకుల్లో భారీగా లోన్స్ తీసుకొని పలు విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారని అభియోగాలు వచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు సోదాలు చేసినట్లు సమాచారం అందుతోంది. అందులో 264 కోట్లు రూపాయలు నిధులు పక్క దారి పట్టించునట్టు మదుకన్ కంపెనీపై అభియోగం ఉన్నట్లు తెలుస్తోంది.

నామా నాగేశ్వరరావుతో పాటు రాంచీ ఎక్స్ ప్రెస్ వే cmd శ్రీనివాస్ రావు, కంపెనీ డైరెక్టర్లు సీతయ్య, పృధ్వీ తేజల ఇళ్లపై కూడా సోదాలు చేశారు అధికారులు. 2019లో నామాపై సిబిఐ కేసు నమోదవగా.. 2020లో చార్జీ షీట్ ఫైల్ చేసింది సిబీఐ. మదుకాన్ ఇన్ఫ్రా, మదుకాన్ ప్రాకెక్ట్, మదుకాన్ టోల్ వే, ఆడిటర్లను చార్జీషీట్లో నిందితులుగా చేర్చింది సిబిఐ. ఈ కేసుపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version