ఎడిట్ నోట్: బాబుకు బూస్ట్.!

-

రాజకీయాల్లో అణిచివేత అనేది తిరుగుబాటుకు కారణమవుతుందనే చెప్పాలి. అధికార బలంతో ప్రత్యర్ధులని ఎంత అణిచివేయాలని చూస్తే అంత ఎక్కువగా తిరుగుబాటు వస్తుందని చెప్పాలి. దాని వల్ల సీన్ రివర్స్ అవుతుంది…అధికార పక్షానికే ఇబ్బంది అవుతుంది. రాజకీయాల్లో ఈ సూత్రం మరిచిపోతే ఎప్పటికైనా అధికార పార్టీలు ఇబ్బంది పడాల్సిందే. గతంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ…ప్రతిపక్ష నాయకుడు జగన్‌ని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందో చెప్పాల్సిన పని లేదు.

జగన్‌ని ఎన్ని రకాలుగా అవమానించారో తెలిసిందే..ఆయన్ని అన్నీ రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన మరింత దూకుడుగా రాజకీయం మొదలుపెట్టారు..పాదయాత్ర చేశారు..ప్రజా మద్ధతు పొందారు. భారీగా సీట్లు తెచ్చుకుని అధికారంలోకి వచ్చారు. అంటే జగన్‌ని అసలు పైకి లేపింది టి‌డి‌పి అని చెప్పవచ్చు. మరి ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. గతంలో కంటే వంద రేట్లు ప్రతిపక్ష టి‌డి‌పిని అణిచివేసే కారక్రమం జరుగుతుంది.

అధికారం ఉండటం వల్ల పోలీసుల సహకారంతో టి‌డి‌పిని ముప్పు తిప్పలు పెడుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. ఎంతగా అవమానిస్తున్నారు..బూతులు తిడుతున్నారు అనేది తెలిసిందే. ఇక ఆయన పర్యటనలని అడుగడుగున అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. దీంతో బాబు ఏమి వెనక్కి తగ్గలేదు. మరింత దూకుడుగా ముందుకెళుతున్నారు. దీంతో ఆయనకు ప్రజల మద్దతు నిదానంగా పెరుగుతూ వస్తుంది. ఆయన రోడ్ షోల్లో భారీగా జనం కనిపిస్తున్నారంటే అది జగన్ ప్రభుత్వం చలువే అని చెప్పవచ్చు.

ఇక తాజాగా అనపర్తిలో ఏం జరిగిందో తెలిసిందే. మొదట జగ్గంపేట, పెద్దాపురం రోడ్ షో, సభలకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు..అదే క్రమంలో అనపర్తి సభకు పర్మిషన్ ఇచ్చారు. కానీ ఏమైందో ఏమో గాని..కొన్ని గంటల్లోనే పర్మిషన్ రద్దు అయిందని చెప్పారు. ఇలా పర్మిషన్ ఇచ్చి రద్దు చేయడంపై బాబు సీరియస్ అయ్యారు. ఎలాగైనా రోడ్ షో చేయాలని నిర్ణయించుకుని ముందుకెళ్లారు…అయినా పోలీసులు అడ్డుకున్నారు..వారే రోడ్డుపై బైటాయించి బాబు కాన్వాయ్‌ని ముందుకు వెళ్లనివ్వలేదు.

దీంతో బాబు అనుహ్యాంగా కాన్వాయ్ దిగి..ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ సభ జరిగే దేవిచౌక్‌కు వెళ్లారు. అక్కడ ప్రజలు వెళ్లనివ్వకుండా పోలీసులు గట్టిగానే ప్రయత్నించారు. కానీ భారీ స్థాయిలో ప్రజలు వచ్చారు. సభ సక్సెస్ అయింది. అయితే ఇదంతా జరగడానికి కారణం జగన్ ప్రభుత్వమే అంటున్నారు. అసలు ఇమేజ్ పడిపోయి ఉన్న చంద్రబాబు ఇమేజ్‌కు బూస్ట్ ఇస్తుందే జగన్ అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version