తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న విషయం తెలిసిందే. గట్టిగా చూసుకుంటే ఎన్నికలకు ఇంకా 8 నెలల సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలవడం కోసం అన్నీ పార్టీలు గట్టిగానే కష్టపడుతున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రధానంగా రాజకీయ యుద్ధం బిఆర్‌ఎస్, బిజేపిల మధ్యే నడుస్తున్నట్లు కనిపిస్తుంది. అలా పోరు క్రియేట్ చేయిస్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో అధికారంలోకి రావాలని బిజేపి ప్రయత్నిస్తుంది..దీంతో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ పార్టీని టార్గెట్ చేయాల్సిందే.
ఎప్పుడైతే బలపడటం మొదలుపెట్టిందో అప్పటినుంచి బిజేపి..కేసిఆర్ సర్కారు టార్గెట్ గానే విరుచుకుపడుతూ వస్తుంది. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది. ఏ చిన్న అంశం దొరికిన..కేసిఆర్ సర్కారుపై విమర్శలు చేస్తున్నారు. అయితే బిజేపి కంటే కాంగ్రెస్ పార్టీకే క్షేత్ర స్థాయిలో బలం ఉంది..కానీ కాంగ్రెస్ లో అంతర్గత పోరు ఉండటం, అలాగే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలివిగా రాజకీయం చేసి బిజేపిని టార్గెట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ హైలైట్ కావడం లేదు. దీని వల్ల బిఆర్‌ఎస్ వర్సెస్ బిజేపి అన్నట్లే పోరు నడుస్తోంది.
అయితే బిఆర్‌ఎస్ పార్టీకి నెక్స్ట్ అధికారంలోకి రావాలంటే ఓ టార్గెట్ కావాలి. 2014 ఎన్నికల్లో తెలంగాణ తెచ్చిన పార్టీగా బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. అలాగే కాంగ్రెస్ పై అప్పుడు వ్యతిరేకత ఉంది. ఇక 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్..చంద్రబాబుని టార్గెట్ చేసింది. ఆయన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అదిగో మళ్ళీ రాష్ట్రంలో ఆంధ్రా వాళ్ళ పెత్తనం పెరుగుతుందని కేసిఆర్ ప్రచారం చేసి..గెలిచారు.
ఇక ఇప్పుడు అలా టార్గెట్ చేయడానికి ఛాన్స్ లేదు..దీంతో కేంద్రంలోని బిజేపిని టార్గెట్ చేసింది..అదిగో కేంద్రంలో ఉన్న బిజేపి రాష్ట్రానికి ఏ మాత్రం సాయం చేయడం లేదని, రాజకీయ కక్ష సాధిస్తుందని, ప్రభుత్వాలని కూలుస్తుందని కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయం చేయడం మొదలుపెట్టారు. అయితే కేసిఆర్‌కు బిజేపి కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తుంది..రాష్ట్రంలో కేంద్రం చేస్తున్న అభివృద్ధికి కేసిఆర్ సహకరించడం లేదని..ఢిల్లీ పెద్దలని పిలిపించి కౌంటర్లు ఇప్పిస్తున్నారు. తాజాగా మోదీ వచ్చి కేసిఆర్ కుటుంబంపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇలా ఒకరినొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. మరి వీరిలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.