ఎడిట్ నోట్ : ఆ ఇద్ద‌రూ ఏం మాట్లాడుకున్నారో..!

-

రెండు తెలుగు రాష్ట్రాల‌కూ చెందిన ముఖ్యమ‌యిన నేత‌లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, కేటీఆర్ ఓ చోటే నిన్న క‌లుసుకున్నారు. దావోస్ లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం మీటింగ్ లో మీడియా క‌ళ్ల‌కు చిక్కారు. ఇద్ద‌రూ న‌వ్వులు చిందిస్తూ..క‌ళ‌క‌ళ‌లాడిపోతున్నా రు. ఇరు రాష్ట్రాల‌కూ ఇవాళ సార‌థ్యం వ‌హిస్తున్న వీళ్లిద్ద‌రూ ఏం మాట్లాడుకున్నారు.. ఏయే విష‌యాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి అన్న‌వి ఆస‌క్తిదాయ‌కం. ఎందుకంటే ఎప్ప‌టి నుంచో ఇరు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌లు ఎన్నో ఉన్నాయి. వాటి గురించే మాట్లాడుకున్నారా లేదా సొంత విష‌యాలు చెప్పుకుని కాలం గ‌డిపేశారా?

ఇవాళ ఆంధ్రాకు, తెలంగాణ‌కు మ‌ధ్య వైరాలు అయితే పెద్ద‌గా ఏమీ లేవు. అభివృద్ధి విష‌య‌మై పోటీ అయితే ఉంది. కొన్ని విష‌యాల్లో తెలంగాణ స‌ర్కారు ఆంధ్రాను మించి ప‌నిచేస్తున్న దాఖ‌లాలు కూడా ఉన్నాయి. కొన్ని విష‌యాల్లో జ‌గ‌న్ కూడా వెన‌క్కు త‌గ్గ‌ని నైజంతోనే ఉన్నారు. మంచి పాల‌న ఇవ్వాల‌న్న త‌లంపుతోనే ఉన్నారు. పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌ల్లో జ‌గ‌న్ ది తొలి అడుగు కాగా, కేసీఆర్ ఇప్ప‌టికే చాలా అడుగులు ఆ దిశ‌గా వేసి స‌ఫ‌లీకృతం అయ్యారు.

ఇక రాజకీయ నేప‌థ్యాలు చూసుకున్నా జ‌గ‌న్ ఓ ఉప ప్రాంతీయ పార్టీ ని లీడ్ చేస్తూ.. తెలంగాణ‌పై కూడా ప‌ట్టు తెచ్చుకోవాల‌ని యోచిస్తున్నారు. కేటీఆర్ మాత్రం కేవ‌లం త‌న‌ని తాను తెలంగాణ‌కు మాత్ర‌మే ప‌రిమితం చేసుకుంటూ, అక్క‌ను జాతీయ రాజ‌కీయాల్లో మ‌ళ్లీ చూడాలి, నాన్న‌ను జాతీయ రాజకీయాల్లో చూడాలి అన్న త‌ప‌న‌తో ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో గ‌తంలో  జ‌గ‌న్ రాణించాల‌ని అనుకున్నా అవేవీ సాధ్యం కాలేదు. కేసీఆర్ కుటుంబం ఆ విష‌యంలో ముందుంది. అనుకున్న‌వి కాస్తో కూస్తో  సాధించింది కూడా! ఈ ద‌శ‌లో ఇరు వ‌ర్గాలూ మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. అదే నిన్న‌టి వేళ చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశాలు ఉండి ఉండ‌వ‌చ్చు కూడా !

Read more RELATED
Recommended to you

Exit mobile version