ఏపీలో జనసేన వర్సెస్ మంత్రి రోజా అన్నట్లుగా రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ప్రత్యర్ధి నేతలపై విరుచుకుపడే మంత్రి రోజా..తాజాగా ఫ్లోలో చంద్రబాబు, పవన్‌లపై విమర్శలు చేయడం కాకుండా..చిరంజీవిని కూడా టార్గెట్ చేశారు. ఎప్పటిలాగానే బాబుపై విమర్శలు చేస్తే టీడీపీ నేతలు రోజాకు కౌంటర్లు ఇచ్చారు. అటు పవన్‌పై విమర్శలు చేస్తే జనసేన వాళ్ళు కౌంటర్లు ఇచ్చారు. కానీ చిరంజీవిని కూడా రాజకీయాల్లోకి లాగి విమర్శించడంపై..మెగా ఫ్యాన్స్ మొత్తం రోజాని టార్గెట్ చేశారు. అదే సమయంలో నాగబాబు సైతం..రోజా టార్గెట్ గా విరుచుకుపడ్డారు.
రోజాది నోరా లేక మున్సిపాలిటీ కుప్ప తొట్టా అని ఫైర్ అయ్యారు. చిరంజీవిని సైతం విమర్శించడంతోనే నాగబాబు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. చిరంజీవిని సైతం సొంత జిల్లా ప్రజలు ఓడించారని, 2009లో పాలకొల్లులో ఓటమిని ప్రస్తావించారు. ఇటు పవన్, నాగబాబు సైతం ఓడిపోయిన విషయాన్ని రోజా గుర్తు చేశారు. సొంత జిల్లా ప్రజలే తిరస్కరించారని, ఇంకా వారిని ప్రజలు ఆదరించారని అన్నారు.
అలాగే సినిమా వాళ్ళు ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తారని, కానీ మెగా ఫ్యామిలీ అలా చేసినట్లు కనిపించలేదని రోజా అన్నారు. దీంతో రోజాకు నాగబాబు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ముందు పర్యాటక రంగాన్ని లాస్ట్ నుంచి ఫస్ట్‌కు ఎలా తీసుకురావాలో చూసుకోవాలని మండిపడ్డారు.
ఇక నాగబాబు వ్యాఖ్యలపై రోజా కౌంటర్ ఇచ్చారు. “విమర్శ చేసేటప్పుడు విషయం ఉంటే చెయ్యాలి లేదా నోటికి ఎంత వస్తే అంత వాగడం కాదు, ఫేక్ వార్తలతో దుష్ప్రచారాలు చెయ్యటం మీకే చెల్లుతుంది. ఏపి గురించి మీకున్న జ్ఞానం శూన్యం అని అందరికీ తెలుసు, నా శాఖ అభివృద్ధి గురించి వ్యాఖ్యలు చేయడం నాగబాబు నీ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం!!” అంటూ పోస్ట్ పెట్టారు.
అయితే అనేక ఏళ్ళు నాగబాబు, రోజా..జబర్దస్త్ ప్రోగ్రాంలో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. అలా కలిసి పనిచేసిన వీరు ఇప్పుడు రాజకీయ శత్రువులుగా మారిపోయారు.