ఎడిట్ నోట్ : రెండంటే రెండు మంచి సందర్భాలు

-

ఇద్దరంటే ఇద్దరు..ఇద్దరంటే ఎందరో కూడా! కలపడం లెక్క లేదా పరిగణన కానీ ఆకలి కన్నీరు వీటిని దాటిన పాట ఉన్న చోట జీవితం ఓ సంతర్పణ..సందర్భోచిత సంతర్పణ..అర్పణ అని రాయాలి నేను..అవును! ఏదో ఒకటి విడిచి మరో విషయం నుంచి సంగ్రహించి సంబంధిత శక్తికి ఆనవాలు కనుగోవడమే సందర్భోచిత యుక్తి. యుక్తి నాలో వైచిత్రి..అవును ! యుక్తి నా అనుకునే పద ధారల చెంత వైచిత్రం తో పాటు వైమనస్యం కూడా! దేశ రాజధానిలో నా తెలుగింటి బిడ్డలు..నా కాదు మా..దిద్దేడు కాశీభట్ల .. నవ్వేను నేను..మళ్లీ మళ్లీ..యతి ఎవ్వరు..గతి ఎవ్వరు..స్తుతి ఎవ్వరు..నిందల చెంత రూపసి ఎవ్వరు..మట్టి నేలలో అముద్రిత గీతాలు ఎవ్వరివి..యవ్వనివి కావొచ్చు..కవితా దినోత్సవం ఏమీ నేర్పకుండా లక్షణం అడుగుతోంది..నవ్వుకున్నాను..మళ్లీ మళ్లీ ఆ ఇద్దరు ఒకరు గరికిపాటి మరొకరు మొగులయ్య..పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న వేళ నా ఇంటి కృతజ్ఞత ఒకటి ఈ రేయి చెంత..

పాల వెన్నెల తుంబుర స్వరం చెంత
పసిడి గోదావరి తుంబుర నాదం చెంత

ఉరుకు కిన్నెరది కావొచ్చు నాకు తెలియదు
పరుగు విశ్వనాథది కావొచ్చు నాకు తెలియదు
విశ్వనాథ పలుకు అని రాశారొకరు పేరు వేటూరి
విరుల తేనె చినుకు కూడా కావొచ్చు..
మళ్లీ పాట మళ్లీ జీవితం హృదయంగమ సారం
సంగమ సారం అని రాయడం తప్పేమో !
సద్గతుల కూడలి అని రాయాలి నేను..నవ్వేను నేను
కన్నీటి జడుల్లో తడిచిపోయాను నేను..
మట్టికి స్వర కూర్పు అందాలి..మృణ్మయం అని రాయండి
అని చెప్పారు వైదికులు..మృణ్మయ నాదం ఒకటి
తుంబుర స్వరం ఒకటి కిన్నెర పాట ఒకటి కలిస్తే వేదం కలిసి సాగించిన ప్రస్థానం వాంగ్మయం

వేదం చెబుతూ చెబుతూ కొన్ని జీవన సూత్రాలు సత్కార్యాలు ఆయనకు గుర్తుకువస్తాయి.ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పేటప్పుడు కటువు లేదా గంభీరత నియమం అవుతుంది..మాట మరింత కఠినం అవుతుంది. ఆ పాటి చెప్పకపోతే వ్యంగ్యం అయినా వాస్తవం అయినా మనిషికి తలకెక్కడం కష్టం..నెత్తికెక్కినవన్నీ మోయడం కష్టం అంటారే ! ఆ విధంగా అహం..
ఆ..విధంగా ఆనందం అన్నీ నెత్తికెక్కి ఉన్నాయి ఇవాళ..తెలుగువారి అందరిలో.. ఆహా! గరికిపాటి …

అన్ని కాలాలూ వేద కాలాలు..అన్ని గమనాలూ చీకటి వాంగ్మయాలకు నేపథ్య గీతికలు.. స్వరం అయి ఉన్నారొకరు..ఆహా! పదం బ్రహ్మ పదం..పదం ఆధ్యాత్మికం.. పదం శివం పదం సర్వం..అన్నీ పలికిన ఆ తీగల వాద్యం చెంత కొన్ని తెలంగాణ జీవితాలు ఉన్నాయి. వాటికి ప్రతినిధి తానేనని పొంగిపోతున్నారు మొగులయ్య (ఇంటిపేరు దర్శనం ఊరు నాగర్ కర్నూలు)…
ఆహా! మొగులయ్య..

పస్తులుండి పాటను పాడిన వాడు..జీవితం ఇదే సారం ఇదే అని నేర్పిన వాడు..మాయ,మిథ్య అన్నవి ఏంటన్నవి వివరించిన వాడు..ఎవడు.. డు కాదు రు.. రు కాదు డు..గతియై కాచువాడెవ్వడు.. మంచి సందర్భం ఒకటి గరికిపాటికి పద్మశ్రీ. మరో మంచి సందర్భం మొగులయ్య (కిన్నెర కళాకారుడు)కి పద్మశ్రీ..ఆనందించాలి మీరు..ఆనందించాలి నేను..ఇరువురికీ వందనాలు చెల్లిస్తూ..

– రత్నకిశోర్ శంభుమహంతి శ్రీకాకుళం దారుల నుంచి…

Read more RELATED
Recommended to you

Exit mobile version