ఎడిట్ నోట్: పవన్ ఓట్ల చీలిక!

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదే పదే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీలనివ్వను అని చెబుతున్నా విషయం తెలిసిందే. ఇలా చెబుతూ ఆయన ఏ పార్టీతో పొత్తుకు రెడీగా ఉన్నారో అర్ధం కాకుండా ఉంది. వాస్తవానికి ఓట్లు చీలనివ్వను అంటే అధికారంలో ఉన్న వైసీపీకి వ్యతిరేక పార్టీలు పొత్తులో పోటీ చేయాలి. కానీ పవన్ ఏ పార్టీతో కలిసి ముందుకెళ్తారో అర్ధం కాకుండా ఉంది. తాజాగా ఆయన ఢిల్లీకి వెళ్ళి..పలువురు బి‌జే‌పి పెద్దలతో భేటీ అయ్యారు. మురళీధరన్, జే‌పి నడ్డా లాంటి నేతలని కలిశారు.

ఇక రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నా ఆయన చివరికి బి‌జేపి పెద్దలతో ఏం చర్చించారో మీడియాకి చెప్పారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం బీజేపీతో కీలక చర్చలు జరిపినట్లు చెప్పారు. అలాగే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండడంపై చర్చించామని, ఇది జనసేన ఎజెండా మాత్రమే కాదు.. బీజేపీ ఎజెండా కూడా అని ఆయన అన్నారు. ఇక అన్నిటిపైనా.. అన్ని కోణాల్లో చర్చించామని.. ఇవి సత్ఫలితాలిచ్చాయని.. అవి ఎలా ఉంటాయో రాబోయే రోజుల్లో తెలుస్తుందని తెలిపారు.

అయితే ఇతర పార్టీలతో పొత్తుల గురించి క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా ఆ స్థాయి దాకా వెళ్లలేదని, ఆంధ్రప్రదేశ్‌లో అధికారం సాధించడానికి అడుగులు వేస్తున్నామని చెప్పారు. అంటే బీజేపీ-జనసేన పొత్తు వరకే ఆయన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలా అని బి‌జే‌పితో పొత్తు కంటిన్యూ అవుతుందనేది క్లారిటీ లేదు.

కానీ ఇక్కడ ఒక్కటే వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలంటే ఖచ్చితంగా పవన్..టి‌డి‌పితో కలవాల్సిందే. టి‌డి‌పి కలవకుండా ఓట్లు చీలకుండా ఉండాలంటే కష్టం. ఇక బి‌జే‌పిని ఒప్పించి టి‌డి‌పితో కలుస్తారా? లేక బి‌జే‌పిని వదిలించుకుని టి‌డి‌పితో కలుస్తారా? అనేది చూడాలి. అలా కాకుండా బి‌జే‌పితో కలిసే ముందుకెళితే ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలడం ఖాయం..అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి పవన్ ఎలా ముందుకెళ్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version