ఎడిట్ నోట్: రేవంత్‌కు ఈటల అస్త్రం.!

-

మరి అనుకుని జరిగిందో లేక..రాజకీయ పరమైన విమర్శల్లో వచ్చిందో తెలియదు గాని..అనూహ్యంగా బి‌జే‌పి ఎమ్మెల్యే ఈటల రాజేందర్..టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రాజకీయ అస్త్రాన్ని అందించారనే చెప్పాలి. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత పోరు సమస్యలతో సతమవుతుంది. ఇటు కే‌సి‌ఆర్ ఏమో..బి‌జే‌పిని టార్గెట్ చేసి..ఆ పార్టీకి హైప్ ఇస్తున్నారు..దీంతో కాంగ్రెస్ రేసులో వెనుకబడింది. ఇలాంటి సమయంలోనే కే‌సి‌ఆర్ పై పోరాడుతున్న ఈటల రాజేందర్…అందులో భాగంగా ఒక మాట కాంగ్రెస్ ని విమర్శించారు. దీంతో సీన్ మొత్తం మారిపోయింది.

కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్ ఒక్కటే అని మాట్లాడుతూ..మునుగోడు ఉపఎన్నికలో కే‌సి‌ఆర్..కాంగ్రెస్ నేతలకు 25 కోట్లు ఇచ్చారని ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలని రేవంత్ రెడ్డి గాని, కాంగ్రెస్ నేతలు గాని సీరియస్ గా తీసుకోరు అని ఈటల అని అనుకున్నారో లేక..రేవంత్ రెడ్డి రియాక్ట్ అవ్వాలని చేశారో తెలియదు గాని..ఊహించని విధంగా రేవంత్ స్పందించారు..కే‌సి‌ఆర్, బి‌ఆర్‌ఎస్ నేతల దగ్గర తాము ఒక్క పైసా తీసుకోలేదని, తీసుకున్నామని ఈటల నిరూపించాలని, మేము డబ్బులు తీసుకోలేదని భాగ్యలక్ష్మీ అమ్మవారు గుడిలో తడిబట్టలతో ప్రమాణం చేస్తానని, ఈటల కూడా రావాలని రేవంత్ సవాల్ చేశారు.

ఈ సవాల్‌కు ఈటల స్పందించలేదు..కానీ రేవంత్ గుడికి వచ్చి ప్రమాణం చేశారు..అలాగే కన్నీళ్ళు కూడా పెట్టుకుని, తన జీవితంలో డబ్బులు తీసుకోలేదని, ఇన్నాళ్ళు ప్రతిపక్షంలో ఉంటూనే కే‌సి‌ఆర్ పై కొట్లాడుతున్నానని అన్నారు.

అయితే హైదరాబాద్‌కు అమిత్ షా వస్తున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లలో ఈటల ఉన్నారు..దీనిపై తర్వాత స్పందిస్తానని ఈటల చెప్పుకొచ్చారు. కానీ రేవంత్ గుడిలో ప్రమాణం చేయడం, ఈటల రాకపోవడంతో సీన్ మారింది. ఈ విషయంలో రేవంత్‌ని అంతా అభినందిస్తున్నారు. ఇక ఈటల  విమర్శలు చేసి, ఆధారాలు చూపించకుండా అలా చేయడం ఏంటని ప్రశ్నలు వస్తున్నాయి. ఒకవేళ రేవంత్..ఈ స్థాయిలో స్పందిస్తారని ఈటల అనుకోలేదని తెలుస్తోంది. మొత్తానికి ఈటల..రేవంత్‌కు రాజకీయంగా ఓ అస్త్రం అందించారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version