ఏపీకి కేంద్రం శుభవార్త..నంద్యాల మెడికల్ కాలేజీకి 150 MBBS సీట్లకు గ్రీన్ సిగ్నల్

-

ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. నంద్యాల మెడికల్ కాలేజీకి 150 ఎంబీబీఎస్ సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నంద్యాల మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కు జాతీయ మెడికల్ కమిషన్ లేఖ రాసింది. 2023-24 విద్యా సంవత్సరంలో నంద్యాల మెడికల్ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి అనుమతి ఇచ్చింది.

విజయవాడలోని హెల్త్ యూనివర్శిటి అండ్ సైన్సస్ సంస్థ పరిధిలో నంద్యాల యూనివర్శిటీ ఉంటుందని నేఠనల్ మెడికల్ కమిషన్ స్పష్టం చేసింది.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుతోనే నేషనల్ మెడికల్ కమిషన్ లేఖ రాసింది. ఎన్టీఅర్ హెల్త్ యునివర్సిటీ పరిధిలో నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ కొత్తగా 150 సీట్లతో వైద్య విద్యా కోర్సులు ప్రారంభించవచ్చని లేఖలో స్పష్టం చేసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చింది ప్రభుత్వం.పేరు మార్చినా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అనే పేర్కొంది నేషనల్ మెడికల్ కమిషన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version