ఎడిట్ నోట్: రణ’తంత్రం’.!

-

ఏపీలో రాజకీయాలు హద్దులు దాటేశాయి. కేవలం మాటల యుద్ధం వరకే ఉండే రాజకీయాలు ఇప్పుడు కొట్టుకునేవరకు వెళ్లిపోయాయి. మొదట బూతులతో మొదలైన రాజకీయం..ఇప్పుడు దాడుల వరకు వెళ్లింది. అయితే అధికార వైసీపీనే పదే పదే దాడులకు పాల్పడుతుందని, పోలీసులు సైతం వైసీపీకే కొమ్ము కాస్తున్నారని టి‌డి‌పి ఆరోపిస్తుంది. కాదు టి‌డి‌పినే కావాలని అల్లర్లు సృష్టిస్తుందని, దీంతో వైసీపీ శ్రేణులు కూడా ప్రతిఘటించడంతో దాడులు జరుగుతున్నాయని వైసీపీ అంటుంది.

ఇలా ఎవరి వర్షన్ వారికి ఉంది. ఆ మధ్య పుట్టపర్తి, పెదకూరపాడు, మాచర్ల, వినుకొండ ఇలా చెప్పుకుంటూ పోతే తాజాగా తంబళ్ళపల్లె, పుంగనూరు వరకు చూసుకుంటే టి‌డి‌పి, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు జరుగుతున్నాయి. మరి ఈ దాడులకు ఎవరు కారణమంటే? న్యూట్రల్ గా ఉండేవారికి ఏమి అర్ధం అవ్వని పరిస్తితి. వాస్తవానికి చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన ఉంది. ఈ పర్యటనని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయి. ఈ క్రమంలో టి‌డి‌పి, వైసీపీ శ్రేణుల మధ్య గొడవ జరిగింది.

ఇక పుంగనూరు పట్టణంలో బాబు పర్యటనకు అనుమతి లేదని పోలీసులుచెప్పారు. కానీ వైసీపీ వాళ్ళకు ర్యాలీ చేసుకునేందుకు అనుమతి ఇచ్చి..రెండు మూడు రోజుల ముందే పర్యటన కోసం అనుమతి అడుగుతున్న తమకు ఇవ్వడం లేదని టి‌డి‌పి శ్రేణులు ఫైర్ అవుతూ..పుంగనూరుకు వెళ్ళేందుకు చూశారు. దీంతో వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇక టి‌డి‌పి శ్రేణులు తిరగబడి, పోలీసులపైనే రాళ్ళు రువ్వారు.

ఇలా రచ్చ రచ్చ జరిగింది. అయితే వైసీపీ, పోలీసులు..ఇదంతా టి‌డి‌పి, చంద్రబాబు చేసిన కుట్ర అని అంటున్నారు. ఇటు టి‌డి‌పి ఏమో..వైసీపీ, పోలీసులు కుట్ర పన్ని దాడులు చేసారని చెబుతున్నారు. ఇలా ఎవరి వర్షన్ వారికి ఉంది. ఇందులో ప్రజలకు ఏది అర్ధమైతే అదే తీసుకుంటారు. కానీ ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల సమయంలో ప్రపంచ యుద్ధం లెక్క టి‌డి‌పి, వైసీపీల మధ్య గొడవ జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version