సంచలనం: టీడీపీతో బీజేపీ పొత్తు..బాబుకు పాజిటివ్‌గా ఈటల..!

-

తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి..ఇప్పటికే రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి..తాజాగా టీడీపీ మరోసారి యాక్టివ్ అయింది. కేసీఆర్ దెబ్బకు టీడీపీ పరిస్తితి దారుణంగా తయారైంది. అటు కాంగ్రెస్ పార్టీ పరిస్తితి దిగజారింది. దీంతో బీజేపీ బలపడింది. అదే సమయంలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీ చేశారు. దీంతో ఏపీలో కూడా పార్టీని విస్తరించాలని చూస్తున్నారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు తాజాగా ఖమ్మంలో భారీ సభ పెట్టి..మళ్ళీ టీడీపీని యాక్టివ్ చేశారు. ఇలా టీడీపీ యాక్టివ్ అవ్వడంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. అసలు ఖమ్మం సభలో బాబు..కేసీఆర్ పై విమర్శలు చేయలేదు. మరో పార్టీపై మాట్లాడలేదు. కానీ బీఆర్ఎస్ నేతలు అనూహ్యంగా స్పందించి బాబుని టార్గెట్ చేశారు..అలాగే బీజేపీతో పొత్తు కోసం తెలంగాణలో బలం ఉందని చూపించుకోవాలని బాబు చూస్తున్నారని విమర్శలు చేశారు. అయితే బీజేపీతో పొత్తు విషయంపై తాజాగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు.

తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తుపై మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకు స్పందించిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్..బీజేపీ ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పార్టీ కాదని, సొంతంగా బలపడే పార్టీ అని, తెలంగాణాలో బీజేపీకి ప్రజల మద్దతు ఉందన్నారు. ఇదే సమయంలో చంద్రబాబుకు మద్ధతుగా ఈటల మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణ వాసన, పునాది రెండు ఉన్నాయని, టీడీపీ ఏమి నిషేధించిన పార్టీ కాదని, తెలుగు దేశం పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని గతంలో చంద్రబాబు కూడా చెప్పారని అన్నారు.

ప్రతి పార్టీకి ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉంటుందని, తెలంగాణ రాష్ట్రంతో టీడీపీకి సంబంధం ఉంది కాబట్టే చంద్రబాబు తెలంగాణలో సభలు పెడుతున్నారని ఈటల చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కచ్చితంగా గెలవబోతున్నదని అన్నారు. మొత్తానికి ఈటల..బాబుకు కాస్త పాజిటివ్ గా మాట్లాడారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version