ధమాకా ప్లాఫ్ ను ముందే ఊహించిన రామ్ చరణ్.. ! అందుకే రిజెక్ట్ చేశారా..

-

టాలీవుడ్ సీనియర్ హీరో రవితేజ యంగ్ హీరోయిన్ శ్రీ లీల జంటగా నటించిన చిత్రం ధమాకా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేదు అయితే ముందుగా ఈ కథను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం రాసారంట అయితే ఆయన ఈ కథను రిజెక్ట్ చేశారని తెలుస్తుంది అంతేకాకుండా అందుకు గల కారణాలేంటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి..

 

ధమాకా మూవీ ని విడుదలకు ముందే ఆకాశానికి ఎత్తేశారు విడుదలకు ముందు వచ్చిన సాంగ్స్ ట్రైలర్ తో సినిమా మంచి హిట్ కావడం ఖాయం అంటూ వార్తలు వినిపించాయి అలాగే ఈ సినిమాతో రవితేజ కథలో మరొక బ్లాక్ బ్లాస్టర్ పడనుందని కూడా అనుకున్నారు సినీ విశ్లేషకులు అయితే విడుదల అయ్యాక మాత్రం అంచనాలు తారు మారు అయ్యాయి సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేదు.. అయితే ఈ సినిమాకు కథను అందించిన ప్రసన్నకుమార్ ముందే ఈ స్టోరీని రామ్ చరణ్ కు వినిపించారంట అయితే అతను దీన్ని రిజెక్ట్ చేశారని తెలుస్తోంది…

ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమాను రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఏంటో తెలిసి వచ్చింది.. చాలా బాగుంటుంది అని థియేటర్లో అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ రెస్పాన్స్ వస్తుందంటూ విడుదలకు ముందే ఈ సినిమాకు కథను అందించిన ప్రసన్నకుమార్ చెప్పుకొచ్చారు అయితే ఇంత హైట్ క్రియేట్ చేశాక సినిమా చూస్తే లాజిక్ క్లాస్ గా అనిపించిందని తెలుస్తోంది అలాగే ఇందులో కథకు ఎలాంటి సంబంధం లేదని ఎక్కడో కనెక్షన్ మిస్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు ఇందులో చిరంజీవి ‘ఇంద్ర’ సినిమా స్ఫూఫ్ కూడా ఉండటంతో చరణ్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ కథ డిజైన్ చేసి ఉండవచ్చనే అనుమానాలకు బలం చేకూరుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version