ఇప్పుడు కరోనా విషయంలో దక్షిణాది సీఎంలు బాగా పనిచేస్తున్నట్టు పేరు తెచ్చుకుంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సీఎంలు కొవిడ్ కంట్రోల్ కోసం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందరి కంటే ముందు మహారాష్ట్రలో లాక్‌డౌన్ పెట్టారు. అలాగే కొవిడ్ కంట్రోల్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వ్యాక్సినేషన్, ఇంటింటి సర్వేలు, లాక్‌డౌన్ ప్యాకేజీలతో ఉద్ధవ్ ఠాక్రే బాగానే పేరు సంపాదించారు.
అలాగే కేరళ కూడా లాక్‌డౌన్‌లో ప్రత్యేకంగా ప్యాకేజీలు అందిస్తోంది. సీఎం విజయన్ ప్రతి ఒక్కరికీ రూ.4వేలు, నెలకు సరిపడా సరుకులు ప్రజలకు అందిస్తున్నారు. ఇంటికెళ్లి వ్యాక్సిన్ వేయిస్తున్నారు. నిత్యం హాస్పిటళ్లను సందర్శిస్తూ మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నారు.
అలాగే కొత్తగా కొలువుదీరిన సీఎం స్టాలిన్ కూడా హాస్పిటళ్లను నిత్యం సందర్శిస్తున్నారు. పేదల కోసం లాక్‌డౌన్ లో ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నారు. ప్రతిపక్షాలతో కలిసి టాస్క్‌ఫోర్స్ కమిటీ వేశారు. అటు ఏపీలో కూడా సీఎం జగన్ వరస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యశ్రీలో కరోనా ట్రీట్‌మెంట్‌ను చేర్చి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. వీరు చేస్తున్న పనులు ఎఫెక్ట్ కేసీఆర్‌పై పడింది. లాక్‌డౌన్ పెట్టడానికి కారణం కూడా అదే. ఆ వెంటనే రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ను అమలు చేశారు. ఇప్పుడు వరుసగా హాస్పిటళ్లను విజిట్ చేస్తున్నారు. ప్రతి పనిని తానే స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రజల్లో పాజిటివ్ వేవ్ సృష్టించుకుంటున్నారు. ఎంతైనా కేసీఆర్ మారారనే చెప్పాలి.