కోవిడ్ 19: కరోనా వైరస్ రక్తంలో చక్కెర స్థాయిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? నిపుణులు ఏమంటున్నారు?

-

సెకండ్ వేవ్ కారణంగా జనాలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. లాక్డౌన్ కారణంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. కేసులు తగ్గుతున్నప్పటికీ మరణాల సంఖ్య తగ్గకపోవడం ఆందోళన కలిగించే విషయం. అదలా ఉంటే మధుమేహంతో బాధపడుతున్నవారికి కరోనా సోకే ప్రమాదం 30శాతం ఉందని నిపుణులు చెబుతున్నారు. హై బ్లడ్ షుగర్ వ్యాధి ఉన్న వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదీగాక, పాజిటివ్ వచ్చాక రక్తంలో చక్కెర స్థాయిలు మారుతున్నాయని అంటున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన డాక్టర్ సుర్జిత్ చెప్పిన దాని ప్రకారం లాక్డౌన్ కారణంగా ఎవ్వరూ బయటకి వెళ్ళట్లేదు. అందరూ ఇళ్ళలోనే ఉండడంతో శారీరక శ్రమ బాగా తగ్గింది. ఈ కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
అదీగాక సరైన ఆహారం లేకపోవడం, జ్వరం మొదలగునవి రక్తంలో చక్కెర స్థాయిలని పెంచుతాయి. కరోనా పాజిటివ్ వచ్చాక రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని నిపుణుల అభిప్రాయం.

శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే పాంక్రియాటిక్ బీటా కణాలను కరోనా వైరస్ ప్రభావితం చేయడం వల్ల ఇన్సులిన్ లోపం ఏర్పడి చక్కెర స్థాయి పెరుగుతుంది. అందువల్ల పాజిటివ్ వచ్చాక డయాబెటిక్ టెస్ట్ అవసరం ఉంటుందని సూచిస్తున్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చాక రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షిస్తుంటే బాగుంటుందని, దానివల్ల ముందు ముందు కలిగే ఇబ్బందులని ఎదుర్కోవచ్చని చెబుతున్నారు. ఇంకా డయాబెటిస్ తో బాధపడుతున్నవారికి కరోనా పాజిటివ్ వచ్చి, ఆ తర్వాత నెగెటివ్ వచ్చినప్పటికీ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version