ఎస్ సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులతో ఆయన ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ లో ప్లాన్ బీ అంటూ కేంద్ర బలగాల గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల విషయంలో అధికారులకు నిమ్మగడ్డ కొన్ని సూచనలు చేశారు. ఎక్కడా కరోన వ్యాక్సినేషన్ ఆగకూడదని, అలాగే పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలు స్వాగతించాలని ఆయన కోరారు. ఎన్నికల ఏకగ్రీవాల విషయంలో ప్రత్యేక అధికారిని నియమించి ఇప్పుడు స్వాగతించాలని పేర్కొనడం సంచలనంగా మారింది.
మొదటి ప్రాధాన్యంగా ఎన్నికలు తీసుకోండి తర్వాతి స్థానాల్లో సంక్షేమం కూడా తీసుకోండి అని ఆయన సూచించారు. అంతేకాక కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు వస్తే స్వీకరించాలని, ఎన్నికలలో వెబ్ కాస్టింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆయన తేల్చి చెప్పారు. అది పోలింగ్ కేంద్రాల్లో కొద్ది ప్రాంతాన్ని మాత్రమే రికార్డు చేస్తుందని ఆ వెబ్ కాస్టింగ్ లో పూర్తి స్థాయి నాణ్యత లేదని పేర్కొన్నారు. వెబ్ కాస్టింగ్ పరిధి అవతల సంఘటన మాట ఏంటి అని ప్రశ్నించి, దాని కోసమే ఎలక్షన్ కమిషన్ ఓ ప్రత్యేక యాప్ తీసుకువచ్చిందని గొడవలు, అసాంఘిక చర్యలు సమాచారాన్ని పౌరులు ద్వారా సమాచారం పంపేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.