ఊపిరితిత్తుల ఆరోగ్యానికి యాలకులు…!

-

సాధారణంగా మనం కొన్ని వంటలు యాలకులని ఉపయోగిస్తుంటాం. యాలకులు వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని ముఖ్యంగా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెప్పడం జరిగింది. ఇప్పుడున్న రోజుల్లో ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంది. ఊపిరితిత్తుల లో కూడా సమస్యలు వస్తున్నాయి.

ఇటువంటి సమయం లో యాలకులని ఉపయోగించడం చాలా మంచిది. అయితే యాలకులు వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి అనేది చూసేద్దాం..!

ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది:

యాలకులలో సీన్సేవుల్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది. దీనిలో యాంటి మైక్రోబియల్ గుణాలున్నాయి. అలానే యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. దీని కారణంగా ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా చేరకుండా ఉంచుతుంది మరియు ఆస్తమా పేషెంట్స్ కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది:

యాలకులు లో రోగ నిరోధక శక్తిని పెంపొందించే గుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. రెస్పిరేటరీ సిస్టమ్ అనేది కంట్రోల్ చేస్తుంది. కాలుష్యం నుండి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. బ్రాంకైటిస్, నిమోనియా వంటి సమస్యల్ని దరి చేరకుండా ఉంచుతుంది.

యాలకులుని ఎలా తీసుకోవాలి..?

వివిధ రకాలుగా మనం యాలకులుని తీసుకోవచ్చు. మీరు కావాలంటే టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. కేవలం రోజుకి ఒకటి నుంచి రెండు సార్లు మాత్రమే తీసుకోవాలి గుర్తుంచుకోండి. ఇలా యాలకులు తో అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version