ఉదయం 10 నుంచి 6గంటల వరకే ప్రచారం.. లేకుంటే

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ప్రభుత్వానికి, పార్టీలకు, అభ్యర్థులకు ఈ కోడ్ వర్తిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు, నాయకులకు వర్తించేలా ఎలక్షన్ కమిషన్ సాధారణ నియమావళిలో భాగంగా కొన్ని సూచనలు చేస్తుంది. కులాలు, మతాల మధ్య, వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజల మధ్య అప్పటికే ఉన్న విభేదాలను పెంచేలా రెచ్చగొట్టడం కానీ.. కొత్తగా విభేధాలు, వైషమ్యాలు సృష్టించడం కానీ చేయరాదు. ఇది అభ్యర్థులు, పార్టీలు అందరికీ వర్తిస్తుంది. ఇతర రాజకీయ పార్టీలను విమర్శించేటప్పుడు వారి విధానాలు, కార్యక్రమాలు, గతంలో పనితీరు వంటి అంశాలకు మాత్రమే పరిమితం కావాలి. నాయకులు, అభ్యర్థులు, పార్టీ కార్యకర్తల వ్యక్తిగత జీవితాలు, ప్రజలతో సంబంధం లేని వ్యవహారాల జోలికి పోరాదు.

నిర్ధరణ చేసుకోకుండా ఇతర పార్టీలు, నాయకులు, కార్యకర్తలపై తప్పుడు ఆరోపణలు చేయడానికి వీల్లేదు. ఓట్ల కోసం కులాభిమానం, మత విశ్వాసాలను వాడుకోరాదు. ఎన్నికల ప్రచారం కోసం మసీదులు, చర్చిలు, ఆలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపయోగించుకోరాదు. ఓటర్లకు డబ్బులివ్వడం, ఓటర్లను బెదిరించడం, ఒకరి ఓటు మరొకరు వేయడం, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేయడం నిషేధం. పోలింగ్ ముగిసే సమయానికి ముందు 48 గంటల లోపు బహిరంగ సభలు నిర్వహించడం పూర్తిగా నిషేధం. పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తరలించడం, వారిని తీసుకెళ్లి, తిరిగి తేవడం నిబంధనలకు విరుద్ధం. రాజకీయ పార్టీలు కానీ, అభ్యర్థులు కానీ తమ ప్రచారంలో భాగంగా ఇతరుల స్థలం, గోడలు, ఇళ్లు, ఇతర వేదికలను వారి అనుమతి లేకుండా ప్రచారానికి వాడుకోవడం నిషిద్ధం. ఇతర పార్టీల, అభ్యర్థుల సమావేశాలు, ప్రచార కార్యక్రమాలను అడ్డుకోవడం నిబంధనలకు విరుద్ధం. ఇలాంటి పనిచేస్తే ఆయా రాజకీయపార్టీలు, అభ్యర్థులు, వారి మద్దతుదారులపై చర్యలు ఉంటాయి. ఇతర పార్టీలకు చెందిన, అభ్యర్థులకు చెందిన పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రిని తొలగించడానికి వీల్లేదు.

అంతే కాదు, నియోజకవర్గాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ప్రచారం చేసుకోవాలని సూచించారు. 24గంటల పాటు ఫిర్యాదులు చేసుకోవచ్చని తెలిపారు.తెలంగాణలో పొలిటికల్ పార్టీలు ప్రచార ప్రకటనల కోసం మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. సింబల్ పక్కన ఈసారి అభ్యర్థి ఫోటో కూడా ఈవీఎం లో ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్స్ నుంచి మంత్రుల ఫోటోలు తొలగించాలన్నారు సీవీ ఆనంద్ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు..తమపై ఉన్న కేసుల వివరాలను మీడియా, – పత్రికలకు ఇవ్వాలన్నారు వికాస్ రాజ్. ఎక్కువ మొత్తంలో డబ్బులు క్యారీ చేస్తే డాకుమెంట్స్ చూపించాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలపై గతంలోని నిబంధలే వర్తిస్తాయన్నారు. లిక్కర్ అమ్మకంపై ఇప్పటికే నిఘా పెట్టామని.. నిబంధనలు పాటించకుంటే సిజ్ చేస్తారని హెచ్చరించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version