ఇటీవల లోక్ సభలో జరిగిన సంఘటన కాంగ్రెస్ నాయకులను తీవ్రంగా కలచివేసింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. దీనితో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అన్ని పార్టీల నేతలు భగ్గుమన్నారు. రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో కేరళ రాష్ట్రం లోని వయనాడ్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పాటుగా, బీజేపీ, మరియు ఇతర స్థానిక పార్టీలు పోటీ చేశాయి.
కాగా ఇదే ఎన్నికల్లో వయనాడ్ ఎంపీ స్థానానికి స్వతంత్ర్య అభ్యర్థిగా కే ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి పోటీ చేశాడన్న విషయం ఆ నియోజకవర్గంలో ప్రజలకు మరియు ఎలక్షన్ కమిషన్ కు తప్ప వేరే వారికి తెలిసే అవకాశం లేదు. ఆ ఎన్నికల్లో రాహుల్ గాంధీ విజయం సాధించడంతో… కె ఈ రాహుల్ గాంధీ మాత్రం కేవలం 2196 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. అప్పుడు కే ఈ రాహుల్ గాంధీ నామినేషన్ సమయంలో సరైన లెక్కలు ఇవ్వలేదని తాజాగా ఎలక్షన్ కమిషన్ తెలిపింది… అందుకే దీనికి పూర్తి బాధ్యత కే ఈ రాహుల్ గాంధీ వహించాలని.. అంతే కాకుండా ఈయన 2024 సెప్టెంబర్ 13 వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.