బ్రేకింగ్; సిఎస్ కి రమేష్ కుమార్ లేఖ…!

-

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయంపై సీఎస్ కు ఎస్ ఈసీ రమేష్ కుమార్ నిమ్మగడ్డ లేఖ రాసారు. సవివర కారణాలతో సీఎస్ కు 3పేజీల లేఖ రాశారు. గతంలో తాను రాజ్ భవన్ లో ఫైనాన్స్ వ్యవహారాలు చూశానని… ఆర్థిక వ్యవహారాలపై నాకు పూర్తి అవగాహన ఉందని వివరించారు. కోరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ , ఒడిసా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపివేశారన్నారు.

ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ నీలం సాహ్ని రాసిన లేఖపై ఆయన స్పందించారు. ఎన్నికలకు ఆర్థిక సంఘం నిధులకు లింక్ పెట్టవద్దని లేఖలో సూచించారు. గతంలో కూడా ఇదేవిధంగా ఎన్నికలు నిలిపివేసినా కేంద్రం నుంచి నిధులు వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. గోవాలో కూడా ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తున్నారన్నారు. కరోనా ఛాలెంజ్ ఎదుర్కుంటున్న ప్రస్తుత దశలో ఏపీ ఒంటరిగా లేదన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమీషన్ Who హెచ్చరికలను,ఆరోగ్య&కుటుంబ సంక్షేమమంత్రిత్వశాఖతో మార్గదర్శకాలను పాటిస్తున్నామని అన్నారు. కాగా రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేయడంపై సిఎస్ నీల౦ సహాని లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో ఎన్నికలను నిర్వహించాలని, రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని ఆమె పేర్కొన్నారు. వెంటనే దీనిపై నిర్ణయం మార్చుకుని ముందు షెడ్యుల్ ప్రకారం ఎన్నికలను పూర్తి చెయ్యాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version