EVMలపై ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషన్ (ఈసీ) ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (ఈవీఎం)కి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై, ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తులతో పాటు, వారి కలర్ ఫోటోలు కూడా పెట్టాలని నిర్ణయం తీసుకుంది.

ఈ కొత్త విధానాన్ని బీహార్ ఎన్నికల నుంచి అమలులోకి తేనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల ఓటర్లు అభ్యర్థులను సులభంగా గుర్తించగలరని ఈసీ భావిస్తోంది. అందుకే ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు వారి కలర్ ఫోటోలు కూడా పెట్టాలని ఈసీ నిర్ణయం తీసుకుంది.