పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్ : రేవంత్ రెడ్డి

-

రేపు ఉదయం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది . ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు .కౌంటింగ్ దగ్గర అలర్టుగా ఉండాలని పార్టీ లీడర్లకు రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. ఈరోజు పార్టీకి సంబంధించిన కీలక నాయకులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటూ మానిటరింగ్ చేయాలన్నారు. పోటా పోటీగాఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు.

ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నవారిని మాత్రమే ఏజెంట్ గా పంపాలని ఆయన సూచించారు.సీనియర్ నాయకులను కూడా కౌంటింగ్ సెంటర్లకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతీ ఏజెంట్ దగ్గర 17సీ లిస్ట్ ఉండాలని,17 సీ లిస్ట్ ఓట్లకు తేడా వస్తే అక్కడే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version