అక్టోబ‌ర్ 25న టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడి ఎన్నిక

-

అక్టోబర్ 25వ తేదీన టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష పదవి కి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను 17వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రక్రియ క్షేత్రస్థాయి నుంచి మొదలు పెట్టు కొని… పట్టణ మరియు మండల స్థాయి వరకు కమిటీల నిర్మాణం పూర్తయిందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12769 గ్రామాల్లో గ్రామ కమిటీలు మరియు 3600 పైచిలుకు వార్డు కమిటీలతో పాటు బస్తీ కమిటీలు, డివిజన్ కమిటీలు, మండల మరియు పట్టణ కమిటీలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు కేటీఆర్. నవంబర్ 15 న వరంగల్ లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన తెలంగాణ విజయ గర్జన నిరహిస్తామని ప్రకటించారు. లక్షలాదిగా మా పార్టీ సభ్యులు తరలివస్తారు …కదలి రావాలని పిలుపు ఇస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version